Home తాజా వార్తలు ఏప్రిల్ 17 నుంచి కానిస్టేబుల్ రాత పరీక్ష హాల్ టిక్కెట్స్ డౌన్‌లోడ్..

ఏప్రిల్ 17 నుంచి కానిస్టేబుల్ రాత పరీక్ష హాల్ టిక్కెట్స్ డౌన్‌లోడ్..

telangana-policeహైదరాబాద్ : పోలీసు కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. 2015 డిసెంబర్ 31న జారీ అయిన నోటిఫికేషనకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ హాల్ టిక్కెట్‌లను ఏప్రిల్ 17 నుంచి 22వ తేదీ అర్థరాత్రి వరకు డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. డౌన్‌లోడ్ సమయంలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఎస్‌ఎస్‌సీ లేదా దాని సమానమైన అర్హతకు సంబంధించిన హాల్‌టిక్కెట్ వివరాలను తెలపాలి.