Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం…

Police Constable raped woman in Nalgonda District

సూర్యాపేట: ఓ మహిళపై కానిస్టేబుల్ అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన సూర్యాపేట జిల్లాలోని వేములపల్లిలో చోటుచేసుకుంది. చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో బాలునాయక్ ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వాహనాల తనిఖీల పేరిట వసూళ్లకు పాల్పడుతుంటాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేములపల్లిలో ఓ జంట వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఆపిన బాలు నాయక్ వారి వద్ద నుంచి డబ్బు వసూలు చేశాడు. ఆ తర్వాత మహిళతో పాటు ఉన్న వ్యక్తిపై దాడి చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బాలు నాయక్‌ను నల్గొండ సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

Comments

comments