Home తాజా వార్తలు గండిపేటలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

గండిపేటలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

Police Cordon Search in Gandipet

రంగారెడ్డి : గండిపేట మండలం పిడంచెరువు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు చేశారు. గంధంగూడ, బైరాగిగూడ, రాజీవ్‌గృహకల్ప కాలనీల్లో ఈ సోదాలు చేశారు. మాదాపూర్ డిసిపి ఆధ్వర్యంలో సుమారు200మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. 20మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 20 బైక్‌లు, మూడు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక ఇద్దరు రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేశారు. కాలనీల్లో సంచరించే అపరిచిత, అనుమానిత వ్యక్తుల గురించి తమకు సమాచారం అందివ్వాలని డిసిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Police Cordon Search in Gandipet