Home తాజా వార్తలు బోరు బావిలో పడి బాలుడి దుర్మరణం

బోరు బావిలో పడి బాలుడి దుర్మరణం

నల్లగొండ జిల్లాలో విషాదం తెరుచుకుని ఉన్న
నీరు రాని బోరు ఆడుతూ అడుగేసి 21 అడుగుల
లోతుకు జారిపోయిన శివ ప్రొక్లైన్లతో 3 గంటల సేపు
సాగిన తవ్వకం అపస్మారక స్థితిలోని బాలుడు
ఆసుపత్రికి తరలింపు అయినా దక్కని ప్రాణాలు

well_manatelanganaమన తెలంగాణ / పెద్దవూర: నాలుగేళ్ల బాలుడు బోరుబావులో పడి బాలుడు మృతి చెందాడు. 20 అడుగుల లోతుకు పడిపోయిన బాలుడిని ఎంతో ప్రయాసపడి వెలికి తీసిన ఫలితం లేకపోయింది. బయటికి తీసిన సమయంలో బాలుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. నాడి కొట్టుకుంటున్నది. వెంటనే నాగా ర్జున సాగర్ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. కాని ప్రయోజనం కలగలేదు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో ఆదివారం నాడు జరిగిన ఈ దుర్ఘటన అందరిని కంటతడిపెట్టించింది. గ్రామంలోని మాంటిసోరి పాఠశాలలో చదువుతున్న బాలుడు బాల గోని శివ (4) ఆదివారం సెలవు రోజు కావడంతో తల్లిదండ్రులతో పాటు పత్తి చేలలోకి వెళ్లాడు. చేరువలోనే పిల్లవాని మామ మూడు రోజులక్రితం వేసిన 230 ఫీట్ల బోరుబావిలో నీరు పడలేదు. దాంతో అందులోని 40 అడుగుల పొడవున్న కేసింగ్ పైప్‌ను బయటికి తీసి బోరు బావి రంద్రంపై గోనె సంచిని కప్పి ఉంచారు. పిల్లవాడు ఆడు కుంటూ వెళ్లి బోరుపై కప్పి వున్న గోనె సంచిమీద కాలుపెట్టాడు. దాం తో జారి బావిలో పడిపోయాడు. గమనించిన తల్లిదండ్రులు, బంధువు లు అప్పటికి పది అడుగుల లోతున ఉన్న బాలుడిని తాడు సాయంతో బయటకు లాగే ప్రయత్నం చేశారు. కాని పిల్లవా డు మధ్యలో ఇరుక్కుపోయి తాడు ప్రయత్నం ఫలించలేదు. ఆ ఒత్తిడికి 21 అడుగుల కిందికి జారిపోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించిన స్థానిక ఎస్‌ఐ ప్రసాదరావు, ఇన్‌చార్జి తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు నాలుగు ప్రొక్లై న్ల సాయంతో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు తవ్వించి బోరు పక్కనే 25 అడుగుల గొయ్యి చేయించి గ్రామస్థుల సాయంతో బాలుడిని వెలికి తీ యించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దాంతో బాలుడు బతుకుతా డనే ఆశలు చిగురించాయి. అంతలోనే అడుగంటాయి. తల్లిదండ్రులు బాల గోని నర్సింహా గౌడ్, సరితలు కన్నీరుమున్నీరయ్యారు. వారికి శివ ఒక్కడే కుమారుడు. జిల్లా వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, నాగార్జునసాగర్ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ నోముల నర్సింహయ్య, దేవరకొండ డిఎస్‌పి చంద్రమోహన్, నిడమ నూరు ఎస్‌ఐ నరసింహారాజు, హాలియా సిఐ పార్థసారధి, ఎస్‌ఐ సురేష్‌కు మార్, పిఎపల్లి ఎస్‌ఐ కొండల్‌రెడ్డి, మండల నాయకులు, రెవెన్యూ అధికారు లు, పోలీస్ సిబ్బంది తదితరులు ప్రదేశాన్ని సందర్శించారు.