Home తాజా వార్తలు ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీసుశాఖ చర్యలు

ట్రాఫిక్ సమస్య నియంత్రణకు పోలీసుశాఖ చర్యలు

Control traffic problems

 

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించుటకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఒక ఎస్సై, ఇద్దరు ఎఎస్సైలు ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లతోకూడిన ట్రాఫిక్ పోలీసు టీమ్‌కు రూపకల్పన చే సినట్లు సమాచారం. రెండు రోజుల్లో ఇం దుకు సంబంధించి నాగర్‌కర్నూల్ ఎస్పీ కార్యాలయం నుంచి జివో వెలవడనున్నట్లు సమాచారం. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంగా ఏ ర్పాటైన తర్వాత జి ల్లా కేంద్రానికి నాలుగు నియోజకవర్గాల ప్రజలు రాకపోకలు సాగిస్తుండటం, జిల్లాలో ఉద్యోగులు, వివిధ వ్యాపారాలకోసం వచ్చి వెళ్లేవారితో నిత్యం నాగర్‌కర్నూల్ రోడ్లు జనసందడిగా మారాయి. దీనికితోడు వివిధ కొనుగోళ్ల నిమిత్తం వచ్చివెళ్లేవారు తమ ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతర వాహనాలను రోడ్లపైనే నిలిపి తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి దుకాణాలకు వెళుతుండటంతో రోడ్డుపై నిలిచిన వాహనాలతో ప్రయాణికులు, పాదచారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

దీనికితోడు శ్రీపురం కూడలి, వక్ప్‌కాంప్లెక్స్, రైతుబజార్, బస్టాండు ప్రధాన కూడళ్లలోపాటు న ల్లవెల్లి కూడలి, రాంనగర్‌కు వెళ్లేదారులు, నాగనూల్ కూడలి వద్ద రోడ్లన్ని ఆక్రమణలకు గురై చిరువ్యాపారులు, దుకాణదారులు తమ వస్తువులను రోడ్డుపై వరకు ఉంచడమే కాకుండా ఆయా దుకాణాలకు వచ్చివెళ్లేవారి వా హనాలతో రోడ్లన్ని ట్రాఫిక్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదే క్రమంలో రైతుబజార్‌కు వచ్చే వేలాదిమంది తమ వాహనాలను రోడ్లపై ఉన్న దుకాణాల ముందు నిలిపివెళుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింతగా ఉ త్పన్నమవుతోంది. శుక్రవారం వచ్చిదంటే బస్టాండు నుంచి నాగనూల్ కూ డలి వరకు ప్రయాణం నరకప్రాయంగా మారుతోందని పలువురు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్ వద్ద నిర్మించిన కొత్త దుకాణ సముదాయం ముందు చేపల వ్యాపారులు, మాంసం విక్రయదారులు రోడ్లపైనే వ్యాపారాలు సాగిస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాలుస్తోంది. దీనికితోడు దుర్వాసన భరించలేని వి ధంగా ఉంది. ఆ ప్రాంతం నుంచి వెళ్లాలంటే ముక్కుపూటలు పగిలేలా దుర్వాసన వస్తోందని ఆ రోడ్డుపై వెళుతున్న వారు, ఆ చుట్టూపక్కల ఉన్న వ్యా పారులు వాపోతున్నారు.

నాగర్‌కర్నూల్‌కు వచ్చిపోయే వాహనాలకు తోడు ప్రయాణికులను చేరవేసే ఆటోలు, తుఫాన్ వాహనాలు ఇతర గూడ్స్ వాహనాలతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా బ స్టాండ్ కాంప్లెక్స్‌కు ఎదురుగా తమ వ్యాపారాలకు తోడు రోడ్డుపై ఇతరుల కు దుకాణదారులు టిఫిన్ సెంటర్లు, జ్యూస్ సెంటర్లు, మిర్చి బండీలు, పం డ్ల వ్యాపారులకు అద్దెకు ఇవ్వడమే కాకుండా కొందరు పూలవ్యాపారులు పోటాపోటిగా రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు సాగిస్తుండటం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదేవిధంగా ప్రధాన ర హదారిపై గల ఫంక్షన్ హాళ్లతో ఇబ్బందులు తప్పడంలేదు. పెళ్లిళ్లు పేరంటాలకు వచ్చేవారు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపి వెళుతుండటంతో ఆ యా వీధుల ప్రజలతోపాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రార్థనాలయాలు సైతం రోడ్లపైనే ఉండటం అక్కడికి వచ్చివెళ్లేవారు సైతం రోడ్లపైనే వాహనాలను నిలుపుతుండటంతో ఇ బ్బందులు తప్పడం లేదు. ప్రజలనుంచి వస్తున్న ఇబ్బందులను గుర్తించిన పోలీసుశాఖ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం ఎస్పీ, ఎఎస్పీలు గత రెండురోజులుగా సమాలోచనలు చేసి జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బందిలోనే కొందరిని ట్రాఫిక్ నియంత్రణ కోసం కేటాయిస్తున్న ట్లు సమాచారం.

Police Department Actions to control traffic problems