Home ఆఫ్ బీట్ దేశంలోనే భేష్… తెలంగాణ పోలీస్

దేశంలోనే భేష్… తెలంగాణ పోలీస్

వాహనాలు, కొత్త భవనాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వారి సొంతం
జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న వైనం
దేశంలోనే నెంబర్ టూ ఠాణాగా పంజగుట్ట

Police

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతలు క్షీణిస్తాయని, మత ఘర్షణలు, నక్సలిజం, టెర్రరిజం పెరుగుతాయనే ప్రచారాన్ని పోలీసు శాఖ ఈ నాలుగేళ్ల ఆచరణ ద్వారా పటాపంచలు చేసింది. దేశంలోనే నంబర్ వన్ పోలీసుగా అవత రించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయ ని, తద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే లక్షానికి అనుగుణంగా పోలీసు శాఖ పనిచేస్తోం ది. నేరాల నివారణకు పోలీసు శాఖ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా నేరాలు గణనీయంగా తగ్గాయి. తెలంగాణ రాష్ట్రం సేఫ్ జోన్‌గా ఆవిర్భవించింది. తెలంగాణ పోలీసు శాఖలో ఈ నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి ఈ కింది విధంగా ఉంది.

హోంగార్డుల జీతాలు పెంపు : ఎన్నో ఏళ్లుగా అరకొర జీతాలతో అష్టకష్టాలు పడుతున్న హోంగార్డులపై ముఖ్యమంత్రి కెసిఆర్ వరాలజల్లు కురిపించారు. ఎవరూ ఊహించని విధంగా వారికి రూ.20 వేల వరకు జీతాలను పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో హోంగార్డులకు రూ.9 వేల జీతం మాత్రమే ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత డిసెంబర్ 5, 2014న రూ. 9 వేల నుంచి రూ.12 వేలకు పెంచారు. ఇక డిసెంబర్ 13, 2017న రూ.12 వేల నుంచి ఏకంగా రూ.20 వేలకు పెంచారు. అంతేకాక ప్రతీ ఏడాది నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇంక్రిమెంటు, హోంగార్డుల తొలగింపు లేకుండా ఉద్యోగ భద్రతకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది.

ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య అలవెన్స్ : నగరంలో పెరుగుతున్న కాలుష్యంతో ట్రాఫిక్ విధుల్లో ఉండే పోలీసులు రోగాల పాలవుతుండడాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ‘కాలుష్య అలవెన్స్’ ఇవ్వాలని నిర్ణయించి జనవరి 3, 2016 నుంచి మూలవేతనంలో 30 శాతం అదనంగా ప్రతీనెలా వేతనంతో పాటు చెల్లిస్తోంది. గతంలో ట్రాఫిక్ విభాగంలో పనిచేయాలంటే శిక్షగా భావించే పోలీసులు ఇప్పుడు ఈ విభాగంలోకి రావడానికి పోటీ పడుతున్నారు. పోలీసు యూనిఫాం అలవెన్స్‌ను కూడా రూ.3,500 నుంచి రూ.7,500కు పెంచింది.

పోలీసు వ్యవస్థ ఆధునీకరణ : పోలీసు శాఖను ఆధునీకరించేందుకు ఖర్చుకు వెనుకాడకుండా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. పోలీసు శాఖకు ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లలో కూడా అధిక నిధులనే కేటాయించింది. 201415 బడ్జెట్లో రూ. 3306.91 కోట్లు, 2015-16లో రూ. 4312.73, 201617లో రూ. 4817.80, 201718లో రూ. 4828.18 కోట్లు, 201819లో రూ. 5,790 కోట్ల చొప్పున కేటాయించింది.

పోలీసు శాఖకు కొత్త సౌకర్యాలు :
* జిపిఎస్, ఇంటర్నెట్‌తో కూడిన ల్యాప్‌టాప్‌లు
* ఆధునిక వసతులతో హైదరాబాద్ నగరంలో 4012 కొత్త వాహనాల కొనుగోలు
* తెలంగాణలోని పాత పది జిల్లాల పోలీసు స్టేషన్లకు 550 కొత్త వాహనాలు.
* నగరంలోని ఒక్కో పోలీసు స్టేషన్ నిర్వహణ ఖర్చు కోసం నెలకు రూ.75 వేలు, జిల్లా కేంద్రాలలో రూ.50 వేలు, గ్రామీణ ప్రాంతాల స్టేషన్‌లకు రూ.25 వేలు.
* జిహెచ్‌ఎంసి పరిధిలో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం కోసం రూ.69.59 కోట్ల వ్యయంతో లక్ష సిసికెమెరాల ఏర్పాటు. కెమెరాలన్ని కమాండ్ అండ్ కం ట్రోల్ రూమ్‌కు అనుసంధానం.
* పోలీసు శాఖలో 36,718 ఉద్యోగాల భర్తీ
జైళ్ల సంస్కరణపై సబ్ కమిటీ : జైళ్ల సంస్కరణలపై క్యాబినెట్ సబ్ కమిటీ వేయాలని ఫిబ్రవరి 2, 2017న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. చైర్మన్‌గా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, సభ్యులుగా మంత్రులు కెటిఆర్, ఈటల రాజేందర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలతో సబ్ కమిటీని మంత్రివర్గం నియమించింది.
‘నేను సైతం’ కార్యక్రమం, ఊరూరా సిసిటివిల వ్యవస్థ…
సిసిటివిల ఏర్పాటుతో హైదరాబాద్‌లో నేరాల నియంత్రణ జరగడంతో ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా గ్రామగ్రామాలకు సిసిటివిల వ్యవస్థను తీసుకెళ్లారు. జిల్లాల్లో ఠాణాల పరిధిలోని ప్రాంతాలు విస్తీర్ణపరంగా పెద్దవి. దొంగతనాలు, మ ధ్యం, ఇసుక అక్రమ రవాణా, పోకిరీల బెదడ, రోడ్డు ప్రమాదాలు.. వీటన్నింటిపై సిసిటివి కెమెరాల నిఘాతో నేరాల నియంత్రణ, దర్యాప్తులో వేగం పెరిగింది. అన్ని మండలాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన జిల్లాగా యాదాద్రిభువనగిరి నిలిచింది.
జిల్లాకో ఇన్వెస్టిగేషన్ సెంటర్ : కేసుల దర్యాప్తు, విచారణలో ఎదురయ్యే సమస్యలు, ఇతరత్రా ఇబ్బందులను చాకక్యంగా పరిష్కరించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ వినూత్న చర్యలు చేపట్టింది. సంచలనాత్మక కేసుల విచారణలో దర్యాప్తు అధికారుల కు సూచనలు, సలహా లు, సందేహాల నివృత్తికి ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ కార్యాచరణ రూపొందించింది. డిజిపి కార్యాలయంలో ఇన్వెస్టిగేషన్ స పోర్ట్ సెంటర్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెల్‌లో అనుభవమున్న పోలీసు అధికారి, న్యాయ నిపుణులు, ఫోరెన్సీక్ నిపుణులు, ఫింగర్ ప్రింట్స్, టెక్నాలజీ అనుభవమున్న వ్యక్తులు ఉంటారు. ఇదే పద్ధతిలో జిల్లాకో ఇన్వెస్టిగేషన్ సెంటర్‌ను త్వర లో ఏర్పాటు చేయబోతున్నారు. అందు కు కావాల్సిన కసరత్తు జరుగుతుంది.
సైబర్ ల్యాబ్‌లు : ఏదైనా కేసులో సాంకేతిక ఆధారాలైన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, సిడిలు, పెన్‌డ్రైవ్‌లు, తదితరాల విశ్లేషణకు సైబర్ ల్యాబ్ లు పోషించే కీలక భూ మికను గుర్తించిన పోలీ సు శాఖ విదేశాల నుంచి భారీ ఖర్చుతో కూడిన కొన్ని టూల్స్‌ను సమకూర్చుకుంది.
పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ భవనం : బంజారాహిల్స్‌లో ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న పోలీసు ట్విన్‌టవర్స్‌కు సిఎం కెసిఆర్ నవంబర్ 22, 2015న శంకుస్థాపన చేశారు. భారతదేశంలోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడుకున్న మొదటి పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్నది. ఇందుకోసం రూ.280.80 కోట్లను కేటాయించారు.
కొత్త కమిషనరేట్లు, డివిజన్లు, సర్కిళ్లు, పోలీసు స్టేషన్లు…
రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లు మాత్రమే ఉండేవి. జనాభా పెరుగుదల, నేరాల విస్తృతి పెరుగుతున్న కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 7 పోలీసు కమిషనరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితో పాటు 27 కొత్త పోలీసు సబ్ డివిజన్లను, 29 సర్కిళ్లను, 103 పోలీసు స్టేషన్లను సైతం ఏర్పాటు చేశారు. ఇలా చేయడం ద్వారా బాధితులకు సకాలంలో నాణ్యమైన సేవలు అందించే అవకాశం కల్పించారు.
పోలీసు అమరవీరుల ఎక్స్‌గ్రేషియా భారీగా పెంపు…
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు చెల్లించే ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం భారీగా పెంచింది. కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ హోదా వరకు ఉన్న సిబ్బందికి ఇప్పటివరకు ఇస్తున్న రూ.25 లక్షల పరిహారాన్ని రూ.40 లక్షలకు పెంచారు. ఎస్‌ఐ హోదా ఉన్న అధికారి చనిపోతే రూ.25 లక్షల నుంచి రూ.45 లక్షలకు, సిఐ, డిఎస్‌పి, అదనపు ఎస్‌పి హోదా గల అధికారులు మృ తి చెందితే ఇస్తున్న మొత్తాన్ని రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు, ఎస్‌పి స్థాయి లేదా ఐపిఎస్ అధికారి మృతి చెందితే రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు పెంచారు.
పోలీసు అధికారులకు పదోన్నతులు : దీర్ఘ కాలంగో పోలీ సు శాఖలో పదోన్నతుల సమస్యకు చెక్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సమస్యకు కెసిఆర్ అక్టోబర్ 7, 2017న పరిష్కరించారు. ఒకే సారి ఏకంగా 275 మందికి నాన్ క్యాడర్ ఎస్‌పిలుగా, ఎఎస్‌పిలుగా, డిఎస్‌పిలుగా పదోన్నతులు క ల్పించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 139 మంది సిఐలకు డిఎస్‌పిలుగా, 103 మంది డిఎస్‌పిలకు ఎఎస్‌పిలుగా, 33 మంది ఎఎస్‌పిలకు నాన్ క్యాడర్ ఎస్‌పిలుగా పదోన్నతి కల్పించారు. అర్హులైన వారికి వివక్ష లేకుండా సకాలంలో పదోన్నతి లభించే విధంగా విధివిధానాలను మార్చారు.
తెలంగాణ పోలీసు యాప్‌కు జాతీయ అవార్డు…
తెలంగాణ పోలీసులు ఈ నాలుగేళ్లలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో ఏ రాష్ట్ర పోలీసులకు లేని విధంగా సమకూర్చుకోగలిగారు. పలు పోలీసు యాప్‌లకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. సిబ్బంది విధినిర్వహణలో జవాబుదారి తనం, నిబద్దత కనిపించే విధంగా యాప్‌లను రూపొందించారు.
పిడి యాక్ట్ : నేరాల నివారణ, శాంతి భద్రతల అదుపు కో సం కరుడు గట్టిన నేరస్తులపై పి.డి. యాక్ట్ ప్రయోగించారు. దీంతో ముందుగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో మూడేళ్ల క్రితం రౌడీషీటర్లు, భూకబ్జాదారులు, వ్యభిచార నిర్వాహకులు, దొంగలు, హంతకులపై పిడియాక్ట్ కేసులు పెట్టారు. దీంతో నగరంలో నేరాలు, ఘోరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీన్ని స్పూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పిడియాక్ట్ కేసులను పెట్టాలని నిర్ణయించారు.

 బిరుదరాజు వాసుదేవరాజు