Home జాతీయ వార్తలు వైసిపి ఎంపిల దీక్ష భగ్నం

వైసిపి ఎంపిల దీక్ష భగ్నం

YCP-MPS

ఢిల్లీ : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలని గత ఆరు రోజులుగా వైసిపి ఎంపిలు ఢిల్లీలోని ఎపి భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. మంగళవారం మరో ఎంపి వైవీ సుబ్బారెడ్డిని కూడా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ప్రస్తుతం దీక్షలో ఉన్న ఎంపిలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిల ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం వారిని పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో ఎపి భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీక్ష విరమించాలని వైద్యులు సూచించినప్పటికీ వైసిపి ఎంపిలు పట్టించుకోకపోవడంతో వారి దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు.

Police Disturb the YCP Mps Deeksha