Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఔటర్ రింగ్ పై గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం

Police Findout Two Unknwon Dead Bodys in Sangareddy

మన తెలంగాణ /పటాన్ చెరు :మండల పరిధిలోని బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు డివైడర్ మద్య చెట్ల పొదల్లో వృద్ద దంపతులుగా అనుమానిస్తున్న రెండు మృతదేహాలు అనుమానస్పద స్తితిలో పడి ఉన్నాయి. ఈ సంఘటన ఈ ప్రాంతంలో ఆందోళన రేకెతించింది. అయితే మృత దేహాలను సంబందించిన వివరాలు తెలియరాలేదు. వివరాల్లోకి వెళితే.. బీడీఎల్ భానూర్ సిఐ వేణుగోపాల్ రెడ్డి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం తెల్లవారు జామున ఓఆర్‌అర్ కు చెందిన రఘు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలంకు వెళ్లిచూడగ గార్డియన్ స్కూల్ సమీపంలో ఓఆర్‌ఆర్ పై ఆడ ,మగ రెండు మృతదేహాలు ఉన్నాయన్నారు. .వెంటనే విచారణ చేపట్టామని , అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఓఆర్‌ఆర్ పైకి కాలినడకన వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైన హత్యచేసి వాహనం పై తెచ్చి ఇక్కడ పడవేసారా అన్న కోణంలో కూడా దర్యాప్థు చేస్తున్నామన్నారు , మృతుని తలకు గాయాలుండడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు పైకి కాలినడుకన వచ్చే వారికి అనుమతి లేదు. అలాంటిది వృద్ద దంపతులు ఏ విధంగా వచ్చారన్న అనుమానాలు ఉన్నాయి.

Comments

comments