Home తాజా వార్తలు తల లేని యువకుడి మృతదేహం లభ్యం

తల లేని యువకుడి మృతదేహం లభ్యం

Police found Dead Body without Head in Rajanna Sircilla district

రాజన్న సరిసిల్ల: తల లేని మొండెంతో ఉన్న యువకుడి మృతదేహం లభించిన దారుణ ఘటన రాజన్న సరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం పెద్దమ్మగడ్డ అటవీ ప్రాంతంలో వెలుగు చూసింది. అడవికి వెళ్లిన పశువుల కాపరులకు తల లేని 30 ఏళ్ల యువకుడి మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి మొండెంను సంచిలో  ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.