Home ఖమ్మం జోరుగా రేషన్ దందా

జోరుగా రేషన్ దందా

police have been raided by the non-avoiding dawn business

పోలీసులు దాడులు చేసినా ఆగని డాన్‌ల వ్యాపారం

అడ్డొస్తే ఎవడినైనా తొక్కిస్తామంటున్న డాన్‌లు
ఇటీవల వాహనాన్ని తీసుకెళ్లినందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై దాడి

మన తెలంగాణ/వైరా : పేద వాడికి అందవల్సిన రేషన్ బియ్యం దందా రోజురోజుకు పెచ్చుమీరిపోతుంది. వైరా, కొణిజర,్ల తల్లాడ మండలాల్లో రేషన్ డాన్ల ఆగడాలకు హద్దుపొద్దు లేకుండా పోతుంది. ఎవడేమిచేస్తే మాకేంటి అడ్డొస్తే అంతుచూస్తామనే బెదిరింపు ధోరణిలో డాన్‌ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. వెంకట కృష్ణ, నర్సింహారావు, బాల,అయ్యర్ అలియాస్ సత్యనారాయణ రేషన్ డాన్‌లుగా చలామణి అవుతున్నారు. కొణిజర్ల, తల్లాడ, వైరా, బోనకల్లు పోలీస్ స్టేషన్లలో వీరిపై పలు కేసులు నమోదైన వారు అక్రమ దందాను ఆపడం లేదు. బలంగా ఉన్న కొంతమంది బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టుకొని రేషన్ దందాను కొనసాగిస్తున్నారు. మండలాల్లో రేషన్ డీలర్ల షాపుల వద్ద భౌన్సర్ల సహాయంతో దందాను కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో టాస్క్‌పోర్సు పోలీసులు, సివిల్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాడులు చేసి పట్టుకున్న రేషన్ దందా ఆగడంలేదు. వైరా మండలం గోవింధాపురం,గన్నవరం, వైరా బీసీ కాలనీ,శాంతినగర్,కొణిజర్ల మండలం దిద్దుపుడి గ్రామం నుండి నేరుగా కాకినాడకు రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పలుసార్లు పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారం. కానీ ఎలాంటి కేసులు నమోదు చేసిన మా వ్యాపారం ఆగేది లేదని వాహనాలను సీజ్ చేస్తే వెంటనే మరో కొత్త వాహనాలను తీసుకొచ్చి దందాను కొనసాగిస్తున్నారు. వెంకటకృష్ణ, నర్సింహారావు, నాగరాజులు రేషన్ డాన్‌లుగా చలామణి అవుతూ దందాను కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో గొల్లపుడి సమీపంలో టాస్క్‌పోర్సు పోలీసుల ఆధ్వర్యంలో పలుచోట్ల దాడులు నిర్వహించిన డాన్‌ల ప్రవర్తనలో మార్పు రాలేదు. రేషన్ దందాకు ముఖ్యంగా రేషన్ షాపు డీలర్లు సహకరిస్తున్నారని సమాచారం. తల్లాడ మండలం నూతనకల్లు, మిట్టపల్లి, అన్నారుగూడెం, నర్సింహారావుపేట, బిల్లుపాడు కేంద్రంగా కొనసాగుతున్న రేషన్ దందా. రంగంబంజర్ సమీపంలో ఓ మిల్లుకు డాన్‌లు బియ్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కొణిజర్ల మండలం దిద్దుపుడి కేంద్రంగా భారీ స్థాయిలో రేషన్ దందాను కొనసాగిస్తున్నారు. లాలాపురం,చిన్నగోపతి,పెద్దగోపతి, తనికెళ్ళ గ్రామాల నుండి దిద్దుపుడి కేంద్రంగా రేషన్ సరఫరాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం రేషన్ షాపులనందు బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టిన కొంతమంది డీలర్లు అక్రమదందా వ్యాపారం చేస్తున్న డాన్‌లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామాల్లో ఎవరైనా ప్రజలు రేషన్ వ్యాపారానికి పాల్పడుతున్నారనే సమాచారాన్ని అందించిన, వాహనాలను అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడుతూ వాహనాలతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న రేషన్ డాన్‌లు. ఈ డాన్‌ల అక్రమవ్యాపారాన్ని ఎంతవరకు అడ్డుకట్టవేస్తారో వేచి చూడాల్సిందే.