Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

శోభాయాత్రలో స్వల్ప ఉద్రిక్తత

Police

భైంసా: శ్రీరామనవమి సం ధర్బంగా భైంసా పట్టణంలో బుధవారం నిర్వ హించిన శోభయాత్రలో స్వల్ప ఉద్రిక్తత ఏర్ప డింది. పట్టణంలోని గోశాల వద్ద శోభయాత్ర ప్రారంభమైంది. హిందూవాహిని ఆద్వర్యంలో జరిగిన శోభయాత్ర పట్టణంలోని బట్టిగల్లి, బస్టాండు నిర్మల్ చౌరస్త మీదుగా రాంలీల మైదానంకు చేరే సమయంలో పిప్రి కాలనీలో గల రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉద్రిక్తత ఏర్పడింది. శ్రీరాముని పాటను బంద్ చేయాలని పోలీసులు చెప్పినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో స్వల్ప లాఠీ చార్జి సైతం చేసి చెదరగొట్టారు. ఈ సంధర్బంగా గుర్తు తెలియ ని వ్యక్తి పట్టణ సిఐ రఘు పైకి ఇటుకను విసరడంతో ఆయన నెత్తికి గాయాలయ్యాయి. హుటాహుటిన చికిత్స కోసం పట్టణంలోని ఒక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి సీఐకి చికిత్సలు చేశారు. ఈ సంధర్బంగా ర్యాలీ ప్రశాంతంగా ముగిసింది. ఎఎస్‌పి పనసరెడ్డి, డిఎస్‌పి అందెరాములు సంఘటన స్థలాన్ని సంధర్శించారు.

Comments

comments