Search
Thursday 15 November 2018
  • :
  • :

లవ్: ప్రాణం తీసిన ప్రియుడు

                     Love-Story

హైదరాబాద్: ఇంటర్ విద్యార్థిని చాందిని జైన్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. చాందిని ప్రియుడు సాయికిరణ్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చాందిని ప్రియుడు సాయి కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. పెళ్లి చేసుకోవాలని చాందిని ఒత్తిడి తేవడంతో సాయి కిరణ్ చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  సాయికిరణ్‌తో పాటు మరెవరైనా ఉన్నారా, ఎలా చంపారనే దానిపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ముందస్తు ప్లాన్‌తో హత్య జరిగిందా, క్షణికావేశంలో ఆమెను చంపి ఉంటాడా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Comments

comments