Home తాజా వార్తలు నిజాం మ్యూజియంలో చోరీపై దర్యాప్తు వేగవంతం

నిజాం మ్యూజియంలో చోరీపై దర్యాప్తు వేగవంతం

Nizam-Musuem

హైదరాబాద్: నిజాం మ్యూజియంలో చోరీపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 15 మంది పాత నేరస్థులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు. సంతకాలు పెట్టేందుకు వచ్చిన రౌడీషీటర్స్‌ను విచారిస్తున్నారు. సిసి టివి ఫుటేజ్‌తో రౌడీషీటర్లను పోలీసులు పోల్చి చూస్తున్నారు. మ్యూజియం పక్కన ఉన్న స్కూల్, కాలేజీ విద్యార్థుల జాబితాను పరిశీలిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే నిజాం కాలం నాటి వజ్రాలు పొదిగిన టిఫిన్‌ బాక్స్‌, బంగారు టీ కప్పు సాసర్‌, స్పూన్‌ ను దొంగలు దోపిడీ చేసిన విషయం తెలిసిందే.