Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రజలకు పోలీసులు చేరువ కావాలి : డిజిపి

DGP-

హైదరాబాద్ : పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావాలని తెలంగాణ డిజిపి మహేందర్‌రెడ్డి తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఫోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో సోమవారం నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో డిజిపి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ కొత్త ఏడాది పోలీసులు కొత్త టెక్నాలజీతో పని చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలువాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా డిజిపి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు  పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Police must get closer to people: DGP

Comments

comments