Home రాష్ట్ర వార్తలు పోలీసు కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

పోలీసు కొలువుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

9281 పోస్టుల భర్తీకి నిర్ణయం
తొలిసారిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ…
జనవరి 11 నుంచి ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు గడువు

policeమన తెలంగాణ/ హైదరాబాద్:  తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోలీసు ఉద్యోగాల భర్తీకి రి క్రూట్‌మెంట్ బోర్డు గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 9281 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన బోర్డు ఇందుకు సంబం ధించిన దరఖాస్తులను తొలిసారిగా ఆన్‌లైన్ పద్దతిలో స్వీకరించాలని నిర్ణయించింది. దరఖాస్తుల స్వీకరణ జనవరి 11వ తేదీ నుంచి  ఫిబ్రవరి నా లుగవ తేదీ వరకు వుంటుందని బోర్డు ఛైర్మన్ జె. పూర్ణచంద్రరావు తెలిపారు. ఫిబ్రవరి నాలుగవ తేదీ దాటిన తరువాత ఎలాంటి దరఖాస్తులను స్వీ కరించేది లేదని, ఆ రోజే చివరి రోజుగా పరిగణిస్తామని ఆయన వెల్లడించారు. మొత్తం పోస్టులో సివిల్ కానిస్టేబుల్స్ (మహిళలు, పురుషులు) 1810 కాగా, సాయుధ బలగం (మహిళలు, పురుషులు) 2760, ప్రత్యేక సాయుధ బలగం (పురుషులు) 56 మంది ప్రత్యేక పోలీసు కానిస్టేబుళ్లు (పురుషులు) 4065, ఎస్‌పిఎఫ్ కానిస్టేబుళ్లు (పురుషులు) 174, అగ్నిమాపక విభాగంలోని ఫైర్‌మెన్‌లో 416 వున్నాయి. అభ్యర్థులు తమ దరఖా స్తులను ఆన్‌లైన్‌లోనే చేయాల్సి వుంటుందని, ఇందు కోసం ఇంటర్నెట్ కేంద్రాలు, ఆన్‌లైన్ లైన్ కేంద్రాలు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్లి www.tslrpv.in అనే వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే అన్ని వివరాలు అందుబాటులో వుంటాయని, జనవరి 11వ తేదీ నుంచి ఈ వెబ్‌సైట్ పనిచేస్తుందని బోర్డు ఛైర్మన్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టుకయితే ఓసిలు 400 రూపాయలు, ఎస్‌సి, ఎస్‌టిలు 200 రూపాయలు చెల్లించాల్సి వుంటుందని, క్రెటిడ్, డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చని ఆయన తెలిపారు. వయో పరిమితిని సర్కారు నిబంధనల మేరకు సడలింపు వుంటుందని, ముందుగా చెప్పిన దాని ప్రకార ం ఐదు కిలోమీటర్లు, రెండున్నర కిలోమీటర్ల పరుగు పందెం రద్దయిందని, దీనికి బదులుగా ముందుగా ఒక అర్హత పరీక్ష వుంటుందని, ఇందులో ఓసిలు 40 శాతం మార్కులు, బిసిలు, ఎస్‌సిలు, ఎస్టీలు 35 శాతం మార్కులు సాధించాలని ఆయన తెలిపారు. కాగా సివిల్ పోలీసు విభాగంలో మహిళలకు 33 1/౩ శాతం, సాయుధ బలగంలో పది శాతం రిజర్వేషన్లు వుం టాయని, ఒకవేళ తగినంత మ హిళా అభ్యర్థులు లభించని పక్షంలో పురుష అభ్యర్థులచే భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. మహిళలకు దే హదా రుడ్య పరీక్షలను రద్దు చేశామని, కాగా క్రీడా పోటీల్లో పురుష అభ్యర్థులు 800 మీటర్ల పరుగు పందెంతో పాటు మరో రెండింటిలో ఉత్తీర్ణులు కా వాలని, మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు పందెంతో సహా మరో దాంట్లో ఉత్తీర్ణులు కావాల్సి వుంటుందని బోర్డు ఛైర్మన్ తెలిపారు. కాగా సాయుధ బలగం అంశంలో మహిళలు అన్నింటిలో ఉత్తీర్ణులు కావాలని ఆయన తెలిపారు. కాగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగ ర్ జిల్లాలలోని గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాల వారికి  ఎత్తు, దేహదారుడ్య పరీక్షల నిబంధనల్లో సడలింపులు వుంటాయని పూర్ణచంద్రరావు వివ రించారు. కాగా కానిస్టేబుల్, ఎస్‌ఐ అభ్యర్థులకు పురుషులకైతే 167.5 మీటర్ల ఎత్తు, 86.3 ఛాతి, ఐదు సెంటీమీటర్ల విస్తీర్ణం కలిగి వుండాలని మహిళలైతే  152.5 మీటర్ల ఎత్తు వుండాలని ఆయన తెలిపారు. గిరిజనులు, ఏజెన్సీ ప్రాంతాల వారికి పురుషులకైతే 160 మీటర్ల ఎత్తు, 80 సెం టీమీటర్ల ఛాతీ తో పాటు మూడు సెంటీమీటర్ల విస్తీర్ణం వుండాలని, మహిళలకు 150 సెంటీమీటర్ల ఎత్తు వుండాలని ఆయన తెలిపారు. కాగా రా త పరీక్షలో పలు అంశాలకు సంబంధించి పర్సనాలిటి టెస్ట్ వుంటుందని, తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యత వుంటుందని బోర్డు ఛైర్మన్ వివరించా రు.