Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

“నా దేవుడు ముఖ్యమంత్రే”

Police Officer Devotion to CM Yogi Adityanath

లక్నో: తన గురువు యోగి ఆదిత్య నాథ్ అంటూ ఓ పోలీసు అధికారి సిఎంకు పూజలు చేశాడు. గురు పౌర్ణమి సందర్భంగా గోరఖ్ పూర్ కు చెందిన పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ యుపి ముఖ్యమంత్రి యోగికి పూజలు చేసి ఆశ్వీరాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రవీణ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. యోగి ముఖ్యమంత్రే కాదు… గోరఖ్ పూర్ ఆలయానికి ప్రధాన అర్చకులు అంటూ పోస్ట్ చేశారు. నెటిజన్లు పోలీసు అధికారిపై మండిపడుతున్నారు. కొందరు మాత్రం ఇందులో తప్పేం ఉందని కామెంట్ పెడుతున్నారు. రెండు ఫోటోలలో ఒకటి యోగి నుంచి తాను ఆశీర్వాదం  తీసుకుంటుంగా, మరొకటి సిఎం ఆ అధికారికి బొట్టు పెడుతూ… పూల దండ వేస్తున్నట్లుగా ఉంది. యూనిఫాంలో ఉండి ఆశీర్వాదం తీసుకోవడం ఏంటని పోలీస్ ను నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Comments

comments