Home తాజా వార్తలు ఎన్నో కష్టనష్టాలను అధిగమించిన పోలీసులు

ఎన్నో కష్టనష్టాలను అధిగమించిన పోలీసులు

Police-Officers-Retirement

పదవీ విమరణ సిబ్బందికి అభినందనలు 

పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్

మనతెలంగాణ/వరంగల్ క్రైం : విధి నిర్వహణలో రాణిస్తూనే తమ పిల్లల అభ్యున్నతికి కృషి చేసిన పదవీ విరమణ చేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపిన వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగంలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారులను సోమవారం రాత్రి వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సన్మానించారు. వరంగల్ పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ అధికారులు పదవీ విరమణ అభినందన సభకు వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదీర్ఘ కాలం ప్రజలకు అందించిన పోలీస్ అధికారుల అనుభవాలతో పాటు వారి కుటుంబ ప్రస్తుత స్థితిగతులను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన రిజర్వు సబ్ ఇన్స్‌పెక్టర్ ఎ.బుచ్చిబాబు, ఎఎస్సైలు జి.రవీందర్, డి.కృష్ణారెడ్డి, కె.సోమేశ్వరచారి, టి.రాధాకృష్ణ, ఎఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు, వి.మనోహర్‌లను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించడంతో పాటు, వారి కుటుంబ సభ్యులకు గృహోపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు ఎన్నో కష్టనష్టాలను అధిగమించి తమ విధుల్లో రాణించి నేటి తరం పోలీసుల ఆదర్శంగా నిలిచిన పోలీస్ అధికారులు పదవీ విరమణ చేస్తున్నందుకు సంతోషోన్ని కలిగిస్తుందని నేడు పోలీసుల యునిఫాంలో మారుమూల గ్రామాన్ని సందర్శించగలుగుతున్నారంటే ఇది కేవలం వీరి కృషి ఫలితమే, ముఖ్యంగా విధి నిర్వహణలో ఉన్న తమ పిల్లలను సమాజానికి ఉపయోగపడే విధంగా, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యాసంస్థల అధినేతలు తీర్చిదిద్దడంలో పదవీ విరమణ చేసిన పోలీస్ సిబ్బంది అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి పూజ, పోలీస్ కమిషనరేట్ పరిపాలన కార్యనిర్వహణాధికారి ప్రమీల, ఎసిపిలు విద్యాసాగర్, సదానందం, ఆర్‌ఐ హతీరాం, ఆర్‌ఎస్‌ఐ శ్రీధర్‌రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌గౌడ్‌తో పాటు పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల కుటుంబసభ్యులు వారి బంధుమిత్రులు పాల్గొన్నారు.