Home జాతీయ వార్తలు నదికి పోలీసు పహారా…

నదికి పోలీసు పహారా…

Ken Riverలక్నో : యుపిలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతం బందా జిల్లాలో ఉన్న ‘కెన్‌’ నది వద్ద గత కొంతకాలంగా  పోలీసు కాపలా కాస్తున్నారు. బందా జిల్లా వాసుల దాహార్తి తీర్చే ఏకైక నది కెన్‌. ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది.  ఇసుక కోసం  నదీ మార్గాన్నే దారి మళ్లించడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నది నుంచి ఇసుకను తరలిస్తుండడంతో జిల్లా ప్రజలు తాగు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడి, తాగునీటి కష్టాలు తీరేవరకు తాము ఈ నదికి కాపలా కాస్తామని పోలీసు తేల్చి చెప్పారు. ఈ నది నుంచి ఇసుక అక్రమంగా తరలించే వారి భరతం పడుతామని వారు హెచ్చరించారు. కెన్ నదికి పోలీసులు కాపలాగా ఉండడంతో బందా జిల్లా ప్రజలు కాసింత ఊపిరి పీల్చుకున్నారు.

Police Protection For Ken River In UP