Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

వ్యభిచార గృహలపై పోలీసుల దాడులు..

Police Rides On Prostitute Homes In Yadadri District
యాదాద్రి ః యాదగిరిగుట్ట పట్టణ పరిధి, పరిసర ప్రాంతాలో గల లాడ్జ్‌లు, వ్యభిచార గృహలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అసాంఘీక కార్యకలాపాల సమాచారంతో రాచకొండ కమీషనర్ ఆదేశాల మేరకు సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న రెండు గృహలను, సూర్య లాడ్జ్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. గణేష్‌ నగర్‌లోని కంసాని లక్ష్మి ఇంట్లో, కందుకూరు గడ్డకు గల కంసాని యాదగిరి ఇంట్లో, మార్కెట్ యార్డు ఆవరణలో గల సూర్య లాడ్జ్ నిర్వహకులు కంసాని అండాలు వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు తెలిసింది.దీంతో నిర్వహకులపై కేసు నమోదు చేసి వ్యభిచార గృహలను, లాడ్జ్ సీజ్ చేసినట్లు సిఐ తెలిపారు. ఇప్పటి వరకు పట్టణ కేంద్రం పరిధిలో 6 లాడ్జ్‌లను, 4 వ్యభిచార గృహలను సీజ్ చేయగా నలుగురు వ్యభిచార నిర్వహకులపై పీడి యాక్ట్ కేసును నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. పుణ్య క్షేత్ర ప్రాంతం అయిన యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల పవిత్రత కాపాడే భాద్యత ప్రతి ఒక్కరి పైన ఉందని దానిని అధిగమించి ఎటువంటి అసాంఘీక కార్యకలపాలు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Comments

comments