Home తాజా వార్తలు తనిఖీలలో దొరికిన మాజీ స్పీకర్ తనయుడు

తనిఖీలలో దొరికిన మాజీ స్పీకర్ తనయుడు

Bike-raceహైదరాబాద్: ఈ మధ్య యువకుల బైక్‌రేసింగ్‌లు ఎక్కువయ్యాయి. పోలీసులు ఎన్ని తనిఖీలు చేపడుతున్న యువకులు మాత్రం బైక్‌రేసింగ్‌లకు పాల్పడటం మానడం లేదు. సంపన్న కుటుంబాల పిల్లలో ఇది అలవాటుగా మారిపోయింది. తాజాగా బంజారాహిల్స్ కెబిఆర్ పార్క్ వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో స్పీకర్ సురేశ్‌రెడ్డి తనయుడు అమిత్‌రెడ్డి దొరికాడు. కెబిఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్‌స చెక్‌పోస్ట్ మధ్యలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జాగ్వర్ కారులో వందకుపైగా కిలోమీటర్ల వేగంతో వెళ్లున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అమిత్ మిత్రులతో పందెం కాసి రేసింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మోటార్ వాహనాల చట్టం కింద అతడికి రూ. 1000 జరిమానా విధించారు. ఈ తనిఖీల్లో వేగంగా వెళ్తున్న 10 ద్విచక్రవాహనాలు, ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నారు.