Search
Sunday 23 September 2018
  • :
  • :

గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఎక్కడ..?

Goldstone-Prasad

గాలింపులో కనిపించని పురోగతి
హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంలో ప్రధాన సూత్రదారి గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తించడంలో పోలీసు శాఖ విఫలమైంది. దేశం విడిచి వెళ్ళ లేదని ధీమాగా చెబుతున్న పోలీసులు ఆయన ఆచూకీని తెలుసుకోవడంలో విఫలమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా మియాపూర్ భూకుంభకోణం, గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ల అంశంపైనే చర్చ సాగుతోంది. రూ. వేల కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా కాజేయాలన్న పథకం వేసిన ప్రసాద్, కుంభకోణం వెలుగులోకి రాగానే కనిపించకుండా పోయాడు. ఆయనను వీలైనంత తొందరగా పట్టుకుంటామని, కొంత సమాచారం సేకరించామని చెప్పిన పోలీసులకు చివరకు నిరాశే మిగిలింది.

ముంబై, ఢిల్లీలలో కానీ, బెంగు ళూరులో కానీ ప్రసాద్ తల దాచుకుని ఉంటాడని భావించిన పోలీసులు ఆయా ప్రాంతాలలో ప్రత్యేక బృందాల ద్వారా గాలింపును చేపట్టారు. అయిన ప్పటికీ ఎలాంటి ఆనవాళ్ళు లభ్యం కాలేదు. కనీసం ఆయన ఆ ప్రాంతంలో సంచరించారా? లేదా? అనే విషయాన్ని కూడా తేల్చలేకపో యారు. దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది ప్రత్యేక పోలీసు బృందాలు ప్రసాద్ ఆచూకి కోసం గాలి స్తున్నా ఇసుమంతైనా సమాచారాన్ని సేకరించలేక పోయారు. ప్రసాద్ కనిపించకుండా పోయాడన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆయన దేశం విడిచి వెళ్ళకుండా అన్ని విమానాశ్ర యాలకు సమాచారం పంపించి అప్రమత్తం చేశారు.

మొదట్లో ముంబైలో ఉంటాడని పోలీ సులు భావించి అక్కడి పోలీసుల సహాయంతో గాలించినా ఫలితం లేదు. ప్రసాద్ అనుచరులు, ఇతరులపై నిఘాను పెట్టినా ఎలాంటి సమాచారం రాకపోవడంతో పోలీసులు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. సాంకేతిక పరి జ్ఞానం పెరిగిన నేపథ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరు మాట్లాడుతున్నారన్న సమాచా రాన్ని సెల్ టవర్ల ఆధారంతో సేకరిస్తున్న పోలీసు లు ప్రసాద్ ఆనవాళ్ళను గుర్తించేందుకు ప్రయ త్నించి విఫలమయ్యారు. మోసాలలో ఆరితేరిన ప్రసాద్ ఎలాంటి సమాచారం దక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉన్నాడని పోలీ సులు అంటున్నారు. నిన్నటి వరకు మెట్రో నగరా లు, ప్రధాన పట్టణాలలో ప్రసాద్ కోసం గాలించిన పోలీసులు ఇక నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల లో సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించారు.

Comments

comments