Home తాజా వార్తలు 300 కిలోల బెల్లం పట్టివేత..

300 కిలోల బెల్లం పట్టివేత..

police seized 300kgs Jaggery

వనపర్తి క్రైంః వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్‌లో గల కొట్ర విజయమోహన్ అనే కిరాణం వ్యాపారి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 300 కిలోల బెల్లాన్ని శుక్రవారం వనపర్తి ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకొని విజయ్‌మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సిఐ మల్లికార్జున్ బాబు తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి అనుమతులు లేకుండా బెల్లం విక్రయిస్తుండడంపై విశ్వసనీయ సమాచారం మేరకు దాడులను నిర్వహించి బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. రూ .లక్ష పూచికత్తుతో స్టేషన్ బెయిల్ మంజూరు చేసి శనివారం వనపర్తి కోర్టులో హాజరు పరుచనున్నట్లు సిఐ తెలిపారు.
.