Home రాష్ట్ర వార్తలు వరంగల్‌లో 16 కిలోల వెండి స్వాధీనం

వరంగల్‌లో 16 కిలోల వెండి స్వాధీనం

breaking newsవరంగల్ : అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న వెండి ఆభరణాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి 16 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మచిలీపట్నంకి చెందిన సుంకరి సురేష్, సుంకరి మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు వెండి ఆభరణాలతో జనగామ వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా వారిని గుర్తించిన రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.