Home అంతర్జాతీయ వార్తలు పోలీసులపై కాల్పులు

పోలీసులపై కాల్పులు

Police Shot dead in America

అమెరికా : ఫ్లోరెన్స్‌లో ఏడుగురు పోలీసులపై దుండగుడు కాల్పులు జరిపాడు. దుండగుడి కాల్పుల్లో ఓ పోలీసు చనిపోయాడు. మరో ఆరుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఫ్లోరెన్స్ సిటీలో పిల్లలను బంధీ చేసిన ఆ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో అతడు కాల్పులు జరిపాడు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ట్రంప్ సానూభూతి ప్రకటించారు. ఈ కాల్పుల ఘటన ఫ్లోరెన్స్ సిటీలో కలకలం రేపింది.

Police Shot dead in America