Home కరీంనగర్ పోలీసుల గౌరవాన్ని పెంచాలి

పోలీసుల గౌరవాన్ని పెంచాలి

police-should-increase-the-honor

పారదర్శకంగా బదిలీలు : సిపి దుగ్గల్ వెల్లడి

మనతెలంగాణ/జ్యోతినగర్: పోలీసులు నిబద్దతతో పని చే స్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు మరింత గౌరవం పెంపొందించేందుకు కృషి చేయాలని రామగుండం పోలీ స్ కమిషనరేట్ సిపి దుగ్గల్ సిబ్బందిని కోరారు. శనివారం ఉదయం ఎన్టీపిసి మినీ హాల్లో పెద్దపల్లి జిల్లా పరిధిలోని 102 మంది ఎఆర్ సివిల్ సిబ్బందిల బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహించి కోరుకున్న పోలీస్ స్టేషన్లకు ఆయన బదిలీలను చేశారు.ఈ సందర్భంగా సిపి పోలీసులను ఉద్దేశిం చి మాట్లాడుతూ పోలీసులు తమ వృత్తి ధర్మాన్ని నిబద్దతతో పనిచేస్తూ రామగుండం పోలీసు కమిషనరేట్‌కు మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా పని చేయాలని ఆయన సిబ్బంది ని కోరారు. పోలీసులు కింది స్థాయి నుండి పని చేస్తేనే డి పార్టుమెంటుకు మరింత గౌరవం పెరుగుతుందని ఆయన వారిని కోరారు. ఇందుకోసం ప్రతి పోలీసు ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని పాటిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి జిల్లా పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్‌ల్లో పని చేస్తూ ఐదు సంవత్సరాల సర్వీసు పూ ర్తి చేసుకున్న ఎఆర్ సివిల్ కు చెందిన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏ ఎస్‌ఐలకు ప్రియారిటి ప్రకారంగా వారు కోరిన పోలీస్‌స్టేషన్లకు బదిలీలను చేశారు. బదిలీ అయిన పోలీసులకు వెంటనే ఆర్డర్లను జారి చేసే జారీ చేస్తామని అన్నారు.బదిలీల కోసం సమీప జిల్లాలోని పోలీస్‌స్టేషన్లకు కోరుకోగా అక్కడ ఖాళీలు లేకపోవడంతో పెద్దపల్లి జిల్లా ప రిధిలోని పోలీస్‌స్టేషన్లకు ఆయన బదిలీ కేటాయించారు. ఈ కార్యక్రమంలోపెద్దపెల్లి డిసిపి సుదర్శన్‌గౌడ్, అడిషనల్ లా అండ్ ఆర్డర్ డిసిపి రవి కుమార్ పాల్గొన్నారు. అనంతరం స్మార్ట్ పోలీస్ అవార్డు పొందిన రామగుండం పోలీస్ కమిషనర్ సిపి దుగ్గల్‌ను ఘనంగా సన్మానం చేశారు.