Home తాజా వార్తలు మీకు భయం అవసరం లేదు…మేమున్నాం

మీకు భయం అవసరం లేదు…మేమున్నాం

police

పల్లె నిద్రతో ప్రజలకు చేరువవుతున్న పోలీసులు
పోలీసులు, ప్రజల మమేకంతో గ్రామాల్లో నేరాలకు చెక్
మెదక్: మండల కేంద్రమైన జిన్నారం పరిదిలోని గ్రామాలలో ఇటీవల కాలం నుండి పోలీసులు చేపడుతున్న పల్లె నిద్ర కార్యక్రమం ప్రజల్లో మంచి గుర్తింపును సంతరించుకుంది. గ్రామాలలో జరిగే నేరాల అదుపునకు, ఆకతాయిల ఆగడాల అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు పల్లె నిద్ర చేపట్టడంతో ప్రజలు పోలీసులతో మమేకం అవుతున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే విధంగా ఈ పల్లె నిద్ర కార్యక్రమం దోహద పడుతున్నది. పోలీసులు ఇన్నాళ్లు పర్యటనలు, గస్తీలు నిర్వహించేవారు. భద్రతా దృష్టా మరింత పకడ్భందీ చర్యలు తీసుకునే విధంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గ్రామాలలో ఎస్‌ఐ లతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పల్లెల్లోని ప్రజలతో కలిసి నిద్రిస్తున్నారు. మీకు భయం లేదు మేమున్నాం అనే విధంగా ప్రజలు వారి విధులను నిర్వర్తిస్తుండడంతో ప్రజలు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం పెంచుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఈ విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జిల్లా ఎస్పీ సుమతి ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది గ్రామాల్లో పల్లె నిద్రద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు.