Search
Sunday 23 September 2018
  • :
  • :

ఖా’కీచకం’

12RRMDC51 01షీ టీమ్ సభ్యుడి..జనం చీ అనే తీరు
మేడ్చల్‌ రూరల్ : మహిళలకు భద్రత కల్పించే షీ టీమ్ సభ్యుడే జనం ఛీ కొట్టే తీరుగా ప్రవర్తించాడు. తన భర్త కనబడడం లేదని ఓ మహిళ పోలీసులను ఆశ్రయిస్తే అదే అదునుగా భావించిన మేడ్చల్ ఎస్‌ఐ సతీష్‌కుమార్ మహిళలను లైంగికంగా వేదింపులకు గురి చేశాడు. ఇక వివరాల్లోకి వెళితే…. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ కు చెందిన లక్ష్మి అనే మహిళ తన భర్త కనపడడం లేదని గత నెల (జులై) 19న మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా కేసును పరిశీలిస్తున్న మేడ్చల్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న 2007 బ్యాచ్‌కు చెందిన సతీష్‌కుమార్ జులై 27 న లక్ష్మికి ఫోన్ చేసి స్టేషన్‌కు పిలిచాడు.

దీంతో లక్ష్మి తన కూతురుతో కలిసి మేడ్చల్ పిఎస్‌కు రాగా ఎస్‌ఐ సతీష్ మొదట లక్ష్మి కూతురు వయస్సు అడుగుతూ ఆరా తీస్తుండగా తాము తమ భర్త ఆచూకి వివరాల కోసం వస్తే ఇలా మాట్లాడడం ఏంటిని లక్ష్మి ప్రశ్నించడంతో తమ కూతురిని బయటకు పంపుమని చెప్పి ఎస్‌ఐ లక్ష్మితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇలా నిత్యం ఫోన్ చేసి సినిమాకు రావాలని,రూమ్‌కు వెళ్దామని వేదింపులకు పాల్పడ్డాడు. నువ్వు నాకు లోంగకపోతే నీ కేసు అంతేనని తేల్చి చెప్పాడు.

దీంతో విసుగు చెందిన లక్ష్మిభర్త ఆచూకి కనుకోవాలని తాను పోలీసులను ఆశ్రయిస్తే ఎస్‌ఐ మాత్రం తనకు నిత్యం ఫోన్ చేసి వేదింపులకు గురిచేశాడని తాను పిలిచిన చోటికి రావాలని ఎస్‌ఐ అసభ్యంగా ప్రవర్తించాడని ఈ విషయం ఎవ్వరికి తెలిపినా నీ భర్త కేసులో నిన్ను ఇరికిస్తానని ఎస్‌ఐ బెదిరింపులకు పాల్పడ్డాడని మహిళ సిపి ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డిసిపి,ఏసిపిలు ఎస్‌ఐ సతీష్ పై చర్యలకు పాల్పడ్డారు. ఎస్‌ఐను కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేశారు.కాగా మహిళలపై అసభ్యంగా వ్యవహరించిన ఎస్‌ఐను సస్పెండ్ చేస్తామని చెప్పి ఇప్పటికి చేయలేదని అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని భాదితురాలు మీడియాను ఆశ్రయించడంతో ఉన్నతాధికారులు మంగళవారం ఎస్‌ఐను సస్పెండ్ చేసి కటకటాల్లోకి పంపారు.

Comments

comments