Home తాజా వార్తలు ట్విట్టర్‌ లో తగ్గిపోయిన ట్రంప్‌, మోడీల ఫాలోవర్లు…

ట్విట్టర్‌ లో తగ్గిపోయిన ట్రంప్‌, మోడీల ఫాలోవర్లు…

modi-trup-image
న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో కొందరు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ట్విట్టర్‌ ఫాలోవర్స్ ను కోల్పోతున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్‌ ఖాతాలో ఇటీవల 43.4 మిలియన్లు ఫాలోవర్స్ ఉండగా కొన్ని రోజుల్లోనే 43.1 మిలియన్‌కు పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారీగా తన ఫాలోవర్స్ ను కోల్పోయారు. ట్విట్టర్ సంస్థ ఫేక్‌ ఖాతాలను తొలగిస్తుండడంతో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఫాలోవర్లను కోల్పోతున్నట్టు సమాచారం. సెలబ్రిటీలు తమ ఫాలోవర్స్ ను కోల్పోతోన్న సినీనటులు జాబితాలో అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రిన్స్ మహేశ్‌ బాబు ఉండటం గమనార్హం. తమ స్పామ్‌ విధి విధానాలకు విరుద్ధంగా ఉన్న ఖాతాలను డిలీట్‌ చేస్తున్నామని ట్విట్టర్‌ ప్రతినిథిలు పేర్కొన్నారు.