Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

గుజరాత్‌లో రాజకీయ సంక్షోభం

  • రాత్రికిరాత్రే 44 మంది ఎంఎల్‌ఎల తరలింపు
  • బెంగళూరు శివారులోని రిసార్టులో బస ఏర్పాట్లు

Rupani-Stry

అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో రాజకీయంగా సంక్షోభ పరిస్థితి నెలకొంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే ఆరుగురు ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ పార్టీని వీడారు. మరికొంత మంది కూడా రానున్న రోజుల్లో పార్టీని వీడే అవకాశముందనే వార్తల నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ముం దస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. తమ పార్టీకి చెందిన 44 మంది ఎంఎల్‌ఎలను బెంగళూరుకు తరలించింది. రాజ్యసభ ఎన్నికల కోసం తమ ఎంఎల్‌ఎలను బిజెపి ఎగరేసుకుపోకుండా ఈ చర్యకు పాల్పడినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 57 మంది సభ్యుల బలముంది. ‘44 మంది ఎంఎల్‌ఎలను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బెంగళూరుకు తరలించింది’ అని ప్రస్తుతం బెంగళూరులోని ఒక రిసార్టులో ఎంఎల్‌ఎలతో పాటు ఉన్న గుజరాత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నిషిత్ వ్యాస్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ‘పార్టీని మారడానికి అంగీకరించని ఎంఎల్‌ఎలు బెదిరింపులకు గురవుతున్నారు. అందువల్ల వారి భద్రత, సంరక్షణ దృష్టా వారిని బెంగళూరుకు తీసుకురావడానికి నిర్ణయించు కున్నాం’ అని ఆయన వెల్లడించారు. అయితే ఆయన ఆరోపణలను గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తోసిపుచ్చారు. ఎంఎల్‌ఎల రాజీనామాలు కాంగ్రెస్ పార్టీ సమస్య అని ఆయన రాజ్‌కోట్‌లో అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తమ ఎంఎల్‌ఎలపై నమ్మకం లేనందు వల్లే వారిని బెంగళూకు తరలించిందని ఆయన వ్యాఖ్యానించారు.
అహ్మద్ పటేల్ గెలుపు కష్టమే
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గెలుపు కష్టమేనని అదే పార్టీకి చెందిన ఎంఎల్‌ఎ రాఘవ్‌జీ పటేల్ జోస్యం చెప్పారు. గుజరాత్‌లో రెండ్రోజుల కిందట ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వారిలో ముగ్గురు బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత మంది పార్టీని వీడే అవకాశముందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా తాను కూడా సొంత పార్టీని వీడి బిజెపిలో చేరవచ్చనే సంకేతమిచ్చారు. రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తరపున అహ్మద్ పటేల్ శుక్రవారం నామినేషన్లు దాఖ లు చేశారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం జరగుతున్న పరిణామాలకన్నింటికీ కాంగ్రె స్ హైకమాండ్‌తో పాటు రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా బాధ్యులే. రానున్న రోజుల్లో మరో 20 మంది ఎమ్మెల్యేలు పార్టీతో తెగదెంపులు చేసుకునే అవ కాశముంది. అలాంటపుడు రాజ్యసభ ఎన్నికల్లో గెలవడం పటేల్‌కు అసా ధ్యమవుతుంది’ అని రాఘవ్‌జీ శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు.

Comments

comments