Search
Wednesday 17 October 2018
  • :
  • :

ఖైరతాబాద్‌లో ఊపందుకున్న రాజకీయ వేడి

 Political heat in Khairatabad

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు అపదర్శ ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడంతో రాజకీయ వెడి ఊపందుకుంది. రాష్ట్రంలోని ఎంతో పేరున్న ఖైరతాబాద్ నియోజక వర్గంలో ఎవరికి వారే తమ పార్టీ తరుపున ప్రచారంతో ముందుకు వెళుతున్నారు. ఈ నియోజక వర్గానికి బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి కూడా చింతలకే టికెట్ కేటాయించడంతో ఇక మహా కుటమి అభ్యర్థి, టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరన్న చర్చ నియోజక వర్గంలో జోరుగా సాగుతోంది. రెండు పార్టీల నుంచి అధికారికంగా అభ్యర్థిని ప్రకటించక పోవడంతో నియోజక వర్గంలో నాయకులతో పాటు కార్యకర్తల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నియోజక వర్గంలో టీఆర్‌ఎస్ నాయకులు మన్నె గోవర్దన్ రెడ్డి, విజయ రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్ నియోజక వర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అయి తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానం అధికారికంగా ప్రకటించక పోవడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరా..? అని నియోజక వర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం సోషల్ మీడియాలో ఇద్దరు నాయకుల పేర్లు ప్రముఖంగా ప్రచారం సాగుతుండగా, అధినేత మదిని దోచుకున్నది ఎవరో తెలాల్సి ఉంది.

గురువారం టిఆర్‌ఎస్ అధిష్టానం నుంచి అభ్యర్థి ప్రకటన వస్తుందన్న ప్రచారం అటు పార్టీ శ్రేణుల్లోనూ ఇటు కార్యకర్తల్లో జరుగా ప్రచారం సాగుతోంది. ఇక మహా కుటమి నుంచి టిడిపి సీనియర్ నేత బీ.నర్సింహారెడ్డి (బీయన్‌రెడ్డి)కి కేటాయించనున్నట్టు నియోక వర్గంలో వినికిడి. ఒప్పందంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డికి కేటాయించిన నేపథ్యంలో మహాకుటమి అభ్యర్థిగా బిఎన్ రెడ్డి పేరును దాదాపు ఖరారు అయినట్టు విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ నియోజక వర్గంలో బీజేపీ మినహా ఇతర అభ్యర్ధులు ప్రకటించక పోతే ఎన్నికల వేడి రాజుకుంది. దసరాలోపు అన్ని పార్టీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉండటంతో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ సారి నియోజక వర్గంలో త్రిముఖ పోటీ జరనుంది. ఏదేమైనప్పటికీ అభ్యర్ధ్థుల ప్రకటన వెలువడాకే ప్రచార పర్వం మరింత ఊపందుకోనుంది.

Political heat in Khairatabad

Comments

comments