Home మంచిర్యాల కెకె ఓపెన్‌కాస్టు గనిపై… నేతల యూటర్న్

కెకె ఓపెన్‌కాస్టు గనిపై… నేతల యూటర్న్

2013లో ఓసికి టిఆర్‌ఎస్ నో 2017లో…?
బాధితులు.. ప్రజాసంఘాలు ఉద్యమాల వైపు

Strike-on-Coal

కాసిపేట : ప్రజా ఉద్యమాలు నేతలు, ప్రజల సహాకారంతో కొనసాగుతాయి. బాదితులకు అండగ అనేక మంది అనుకూలంగా స్పందిస్తారు. కాని కాసిపేట, మందమర్రి మండలాల సరిహాద్దులో సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టిన కళ్యాణిఖని ఓపెన్‌కాస్టు గని విషయంలో కొందరు నేతలు యూటర్న్ తీసుకున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. సింగరేణి సంస్థ మూసివేసిన కెకె రెండు గని, సోమగూడెం ఒకటి గని, సోమగూడెం మూడు, కెకె రెండు ఎ గనుల స్థానంలో కెకె మెగ ఓసికి శ్రీకారం చుట్టిం ది. కొన్ని సంవత్సరాలుగా పలు గ్రామాల ప్రజలు ఓసిని వ్యతిరేకిస్తు ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఐనప్పటికి సింగరేణి యాజమాన్యం రెవెన్యూ సహాకారంతో ప్రభుత్వం ఆధీనంలో వున్న భూమితో పాటు మరి కొంత మంది రైతుల భూములను సింగరేణికి అప్పగిస్తుంది.

ఈ నేపద్యంలో ఓసి ల వల్ల పర్యవరణం దెబ్బ తింటుందని, గ్రామాలు లేకుండా పోతాయని, పచ్చని పల్లెలు కనుమరుగు అవుతాయని దీంతో ప్రజా జీవనం అస్తవ్యస్తం అవుతుందనే ఉద్దేశ్యంతో ఓసిలకు వ్యతిరేకంగా గ్రామాల ప్రజలు వారికి అండగ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు ఇస్తున్నారు. అంతే కాదు కెకె ఓసి కొరకు 2013 ఫిబ్రవరి 13న కెకె రెండు గని సమీపంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యాక్రమాన్ని అప్పటి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అశోక్ అధ్యక్షతన సింగరేణి సంస్థ నిర్వహించగా కాసిపేట, దుబ్బగూడెం, ఎర్రగుంటపల్లె సహా అనేక గ్రామాల ప్రజలు ఓపెన్‌కాస్టు గని వద్దంటు ఆందోళనలు కూడా చేపట్టారు. అదే 2013 సమయంలో చెన్నూర్ అప్పటి ఎంఎల్‌ఎ నల్లాల ఓదేలు వందలాది మంది కార్యకర్తలతో కలసి వచ్చి ఓసికి వ్యతిరేకంగా పోరాడాడు. నాడు పోలీసులు ఎంఎల్‌ఎ ఓదేలును చేతుల మీదుగా ఎత్తుకొని వెళ్లి పోలీసు జీపులో తీసుకు వెళ్లిన సందర్బం వుంది. టిఆర్‌ఎస్ కార్యాకర్తలు పెద్ద ఎత్తున నినదించారు.

ఇదిలా వుండగా ఇదే ఓసి విషయంపై కాంగ్రేస్ పార్టీ ఆద్వర్యంలో కూడా మరో మారు అధినాయకులు పాత ఎంఆర్‌వో కర్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేసారు. అప్పటి కాంగ్రేస్ మహాధర్నా లో ఇప్పటి ప్రభుత్వ సలహాదారులు గడ్డం వివేకనంద, ఇప్పటి కాంగ్రేస్ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి, సహా కాంగ్రేస్ ముఖ్య నేతలు పాల్గోన్నారు. వారికి పెద్ద ఎత్తున ప్రజలు సహాకరిం చారు. కాల క్రమేణ సింగరేణి యాజమన్యం యుద్ద ప్రతిపా దికన కెకె ఓసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. సంవత్సరాలు మారాయి నేతలు కూడా మారారు. కొందరు నేతలు పార్టీలు కూడా మార్చారు. కాని ఓసి కొరకు మాత్రం రై తులు నిర్వాసితులు, ఆ యా గ్రామాల ప్రజలు ఉ ద్యమిస్తునే వున్నారు. తా జాగా సింగరేణి సంస్థ ఓ పెన్‌కాస్టు గనిని ప్రారం భించింది. ఇప్పటికే గోం డుగూడకు చెందిన గిరిజ నులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కోర్టు స్టే ఆర్డర్ పాస్ చేయించింది. అయినప్పటికి ఓసిని సం స్థ అదికారికంగా ప్రారం భించడం గమనార్హం.

ఇప్పటికే ట్యాంకుబస్తికి చెం దిన గిరిజనులు మా భూములు సింగరేణి లాక్కుందని, బినామీలు సృష్టించిందని వారు ఎస్‌సి, ఎస్టీ కమీషన్‌ను ఆశ్రయించారు. ప్రస్తుతం రీ సర్వే విషయంలో తర్జన భర్జనలు నడుస్తున్నాయి. కాగా సింగరేణి సంస్థ మాత్రం మా స్థలాలు అంటు చదును చేసే కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పలువురు ని ర్వాసితులు మళ్లీ ఫిల్ వేసినట్లు సమాచారం. ఏది ఏమైన నాడు తమ భవిష్యత్తు కొరకు ఉద్యమాలకు ముందు నిలిచిన నేతలు నేడు తమ పదవుల పందేరంలో యూటర్న్ తీసుకున్నారనే వాదనలు వినవస్తున్నాయి. ప్రస్తుతం కెకె ఓసి విషయంలో గిరిజనులు, భూనిర్వసితులు, గ్రామీణు లు, తమ భూముల కొరకు, తమ జీవన విదానాల కొరకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే కెకె ఓసి విషయంలో పలు గ్రామాల ప్రజలు న్యాయస్థానం మెట్లు ఎక్కి న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఐనప్పటికి తాజాగా సింగరేణి సంస్థ మాత్రం తమ పనులు తాము చక్కపెట్టుకుపోతుంది. ఇటీవలనే ఓసిని సింగరేణి సంస్థ ప్రారంభించింది.