Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

బెంగాల్‌లో నాటుబాంబుల దాడి… నలుగురు మృతి

BOMB2మాల్దా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సందర్భంగా మరోసారి హింస చోటుచేసుకుంది. మాల్దా జిల్లా జైన్‌పూర్ గ్రామంలో టిఎంసి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన దాడిలో నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాటు బాంబులతో టిఎంసి కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు టిఎంసి నేతలు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అయితే టిఎంసి ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బెంగాల్‌లో శనివారం ఐదో దశ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 78.25 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల నియామావళిని ఉల్లంఘనతో పాటు, హింసకు పాల్పడినందుకు సుమారు 186 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Comments

comments