Home నిజామాబాద్ ఒత్తిడిలో ఖాకీలు

ఒత్తిడిలో ఖాకీలు

Political Presure On Police Department In Nizamabad Dist

శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణగా నిలిచే పోలీసు శాఖకు మొదటిసారిగా సుస్తీ చేసింది. సమాజంలో అన్ని వర్గాలకు పోలీసింగ్ ద్వారా అండగా నిలిచే పోలీస్ శాఖ సిబ్బందిలో మానసిక స్థైర్యం తగ్గుముఖం పట్టడమే అందుకు కారణంగా తెలుస్తోంది. కుటుంబ తగాదాల్లో విడిపోయిన భార్యభర్తలను కలిపేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం, దొంగతనాలు, రౌడీయిజం చేస్తూ అసాంఘీక శక్తులుగా మారిన వారిని సైతం కౌన్సిలింగ్ ద్వారా మార్చడం మొదలుకొని రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలకు రక్షణగా  పోలీసులు నిలుస్తుంటారు. విధి నిర్వహణలో వారికి అలుపు అన్నది లేకపోగా రాత్రిళ్లు ప్రజల ప్రశాంత జీవనానికి పోలీసులే భరోసా. తిరిగి ఉదయం తెల్లవారుజాము నుండి ట్రాఫిక్ నియంత్రణ, విఐపిల భద్రత, ఇతర కార్యక్రమాలు ఇలా రోజువారీ కార్యక్రమాలు కంటి మీద కునుకులేకుండా చేస్తాయి. అయితే ఇక్కడే ఆ శాఖపై అవినీతి ఆరోపణలు, ఆది నుంచి తీవ్రంగానే ఉన్నాయి. లాఠీ, తూటా చెవిలో ఉండటంతో వారి ఖాకీ డ్రెస్‌కు వచ్చిన పవర్‌ను దుర్వినియోగం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన వారు ఉన్నారు. మొత్తానికి మంచి, చెడుల మిశ్రమంగా ఉన్న పోలీసుశాఖ మొదటిసారిగా ఒత్తిడికి గురవుతోంది.

మనతెలంగాణ/నిజామాబాద్‌ప్రతినిధి
శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణగా నిలిచే పోలీసు శాఖకు మొదటిసారిగా సుస్తీ చేసింది. సమాజంలో అన్ని వర్గాలకు పోలీసింగ్ ద్వారా అండగా నిలిచే పోలీస్ శాఖ సిబ్బందిలో మానసిక స్థైర్యం తగ్గుముఖం పట్టడమే అందుకు కారణంగా తెలుస్తోంది. కుటుంబ తగదాల్లో విడిపోయిన భార్యభర్తలను కలిపేందుకు కౌన్సెలింగ్ నిర్వహించడం, దొంగతనాలు, రౌడీయిజం చేస్తూ అసాంఘీక శక్తులుగా మారిన సైతం కౌన్సిలింగ్ ద్వారా మార్చడం మొదలుకొని రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజలకు రక్షణగా పోలీసులు నిలుస్తుంటారు.
విధి నిర్వహణలో వారికి అలుపు అన్నది లేకపోగా రాత్రిళ్లు ప్రజల ప్రశాంత జీవనానికి పోలీసులే భరోసా. తిరిగి ఉదయం తెల్లవారుజామున నుండి ట్రాఫిక్ నియంత్రణ, విఐపిల భద్రత, ఇతర కార్యక్రమాలు ఇలా రోజువారీ కార్యక్రమాలు కంటి మీద కునుకులేకుండా చేస్తాయి. అయితే ఇక్కడే ఆ శాఖపై అవినీతి ఆరోపణలు, ఆది నుంచి తీవ్రంగానే ఉన్నాయి. లాఠీ, తూటా చెవిలో ఉండటంతో వారి ఖాకీ డ్రెస్‌కు వచ్చిన పవర్‌ను దుర్వినియోగం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన వారు ఉన్నారు. మొత్తానికి మంచి, చెడుల మిశ్రమంగా ఉన్న పోలీసుశాఖ మొదటిసారిగా ఒత్తిడికి గురవుతోంది. గత కొన్నేళ్లుగా పోలీస్‌శాఖపై ఉన్న చెడు ప్రభావాన్ని తగ్గించేలా సముల మార్పులకు శ్రీకారం చుట్టిన ఆ శాఖ ఉన్నతాధికారులు సిబ్బంది కష్ట, నష్టాలపై దృష్టిసారించకపోవడంతో విచిత్ర పరిస్థితి తలెత్తింది. ఓ వైపు నెలవారి మాముళ్ల నుండి తమ సిబ్బందిని దూరం చేయాలన్న ప్రయత్నం ప్రజల నుండి సానుకూల స్పందన సాధించగా ఆ శాఖలో మాత్రం చర్చకు దారితీసింది. దీనికి తోడు సివిల్ తగాదాల్లో ఎలాంటి జోక్యం చేసుకోరాదని గత కొన్నేళ్లుగా పోలీసులపై ఆంక్షాలు ఉన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి భారీ ఆదాయాన్ని కోల్పోయిన పోలీస్ అధికారులు అడపాదడపా సివిల్ కేసులవైపు దృష్టి సారించి శాఖ పరమైన చర్యలకు బలయ్యారు. మొత్తానికి సివిల్ తగదాల్లో పోలీస్ జోక్యం పరోక్షంగా కనిపిస్తోంది. తాజాగా డిజిపి మహేంధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించక పరిస్థితి మరింతగా మారిపోయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలాఓ వసూళ్లకు పాల్పడుతూ సిఐ, ఎస్సైను మామూళ్లను ఇచ్చే సిబ్బందిపై డిజిపి కొరడా ఝులిపించారు. ఎస్సై, సిఐలకు ఈ ఘటన షాక్‌కు గురి చేయగా ఒక్కసారిగా నెలవారి మాముళ్ల వ్యవహారానికి బ్రేక్ పడింది. వివిధ కేసుల్లో స్టేషన్‌కు వచ్చే వారి నుండి అందినంత దండుకునే వ్యవహారంపైనే పోలీసుబాస్ నిఘా ఉన్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. శాఖపరమైన చర్యలకు బయపడి అమ్యామ్యాలకు దూరంగా ఉంటున్న ఎస్సైలు, పోలీస్‌స్టేషన్ విదుల పట్ల ఆసక్తి చూపడం లేదని సమాచారం. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాధాన్య విభాగాలకు బదిలీ చేయించుకునేందుకు ఉమ్మడి జిల్లాలకు చెందిన 15మంది ఎస్సైలు, 4గురు సిఐలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మరికొందరు సిబ్బంది సైతం అదే బాటలో నడవాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ మేరకు ఎస్సైలు అంతర్గత సంభాషణల్లో తమ శాఖ పనితీరుపట్ల విస్తృతంగా చర్చించుకుంటూ అసంతృప్తిని వెళ్ల గక్కుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీస్ శాఖలో సిబ్బంది దూకుడు తగ్గగా శాఖపరమైన వ్యవహారాల్లో అంటిముట్టన్నట్లు వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. వీటికి తోడు శాఖ పరమైన ఒత్తిడి సైతం సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్లు తెలిసింది. తమ స్టేషన్‌కు నిబంధనల మేరకు, అవసరాల రిత్యా ఇవ్వాల్సిన సిబ్బందిని ఇవ్వకపోగా పనిభారాన్ని పెంచారన్నది వారి ఆవేదనగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంత పోలీస్‌స్టేషన్‌కు ఒక ఎస్సై, ఇద్దరు ఎఎస్సైలు, 4 గురు హెడ్‌కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లను ఇవ్వాల్సి ఉంది. అయితే పరిస్థితి మాత్రం మరోలా కనిపిస్తోంది. కానిస్టేబుళ్ల సంఖ్య తక్కువగా ఉండగా వారిలో కోర్సు విదులు, సిఐ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయలతో అను సందానం, కంప్యూటరీకరణ నిమిత్తం, కేసుల నమోదు, చార్జీషీట్‌లు, ఇతర పత్రాల తయారీ ఇలా ఆయా విభాగాలకు సిబ్బందిని కేటాయించగా సాదరణ శాంతిభద్రతల విభాగంలో కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే మిగులుతున్నారు. వీరిలో వ్యక్తిగత విషయాల్లో ఎవరికైనా పనిబడితే ఎస్సైకి సహాయకులు లేకుండా పోయినట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో తమ ఠాణా పరిధిలో ప్రముఖులు పర్యటనయితే అది ఎస్సైలకు అదనపు భారంగా మారుతోంది. దీనికి తోడు స్టేషన్ నిర్వహణకు తాజాగా పెంచిన నిధుల్లోను వాటాలు పోగా స్టేషన్ నిర్వహణ భారంగా మారినట్లు ఆ శాఖలో అంతర్గతంగా అసంతృప్తికి కారణమైనట్లు సమాచారం. ప్రతినెల వేతనం నుండే కొంత మేర స్టేషన్ అవసరాలకు వాడాల్సి రావాడాన్ని ఎస్సైలు జీర్ణించుకోవడం లేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్నతాధికారుల నుండి వచ్చే ఆదేశాలు సైతం ఎస్సైలపై తీవ్ర ప్రభావం చూపుతుండగా కేవలం గంటల వ్యవధిలో సమాచారాన్ని కోరడం, సిబ్బంది లేకపోవడంతో వారు తలపట్టుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొద్దంతా, రాత్రంతా, తీరిక లేకుండా విధులను నిర్వహిస్తున్న తమకు కనీసం గంటల వ్యవధి విశ్రాంతి దొరకడం లేదని, తమకు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారని, తాము మనుషులమేనంటూ ఎస్సైలు వాపోతున్నట్లు సమాచారం. ఎస్సైల కుటుంబసభ్యులు సైతం ప్రశాంత జీవనానికి మొగ్గు చూపుతుండగా ఎస్సైలు లూప్‌లైన్లలో పొస్టింగ్‌ల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
* ప్రక్షాళన మంచిదే… ?
పోలీస్‌శాఖలో ప్రక్షాళన పట్ల ప్రజల్లోని వివిధ వర్గాల నుండి సానుకూల స్పందన కనిపిస్తోంది. గతంలో పోలీస్‌స్టేషన్ అంటే గతంలో సామాన్యునికి వెన్నులో వణుకు పుట్టేంది. క్రమేణా ప్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సామాన్యుడు పోలీస్‌స్టేషన్‌కు దర్జాగా వెళ్లి వస్తున్నా అవినీతి జాడ్యం శాఖను వీడటం లేదు. అయితే సమూల మార్పుకు డిజిపి శ్రీకారం చుట్టగా సిబ్బంది సమస్యలపై దృష్టి సారించలేకపోయారు. కావాల్సిన ఫలితాన్ని రాబట్టాలంటే తమ ద్వారా ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారులు సవరించుకోవాల్సి ఉంది. స్టేషన్ నిర్వహణకు కావాల్సిన నగదును ఎలాంటి కోతలు లేకుండా అందించడం, ఒత్తిడిని తగ్గేంచేలా సరిపడా, సిబ్బందిని ఇవ్వడం, మానసిక ప్రశాంతతకు కావాల్సిన విశ్రాంతి దొరికేలా పనివేళలు నిర్ణయించడం లాంటి సవరణలు చేపడితే మెరుగైన, ఆశించిన ఫలితాలను సాధించే అవకాశం ఉంది.