Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రసకందాయంలో తమిళ రాజకీయం

Sasikala-and-Panneerselvam

చెన్నయ్ : తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడింది. సిఎం పదవి కోసం అన్నాడిఎంకె ప్రధానకార్యదర్శి శశికళ, ప్రస్తుత సిఎం పన్నీరు సెల్వంలు పోటీ పడుతున్నారు. అయితే శశికళ వెంట 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పన్నీరు సెల్వం వెంట నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపిలు ఉన్నట్లు తెలుస్తోంది. క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను ఓ హోటల్‌లో శశికళ ఉంచినట్లు సమాచారం. ప్రతిఒక్క ఎమ్మెల్యేకు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పెట్టినట్లు తెలిసింది. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్‌లను కూడా సెక్కూరిటీ గార్డులు తీసుకున్నట్లు సమాచారం. మరో 40 మంది ఎమ్మె ల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. గురువారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి బల ప్రదర్శన చేసేందుకు శశికళ సిద్ధమవుతోంది. ఈ రోజు సాయంత్రం ముంబయి నుంచి గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నయ్ రానున్నారు. ఆయన చెన్నయ్ వచ్చిన వెంటనే ఆయన్న కలిసేందుకు శశికళ అపాయింట్‌మెంట్ తీసుకున్నారని, విద్యాసాగర్‌రావు ఆమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత సిఎం పన్నీరు సెల్వం కూడా గవర్నర్‌ను కలిసేందుకు యత్నిస్తున్నారు. అయితే పన్నీరు సెల్వంకు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇస్తారా, తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్న శశికళను సిఎంగా పీఠంపై కూర్చబెడుతారా అన్నది కాలం నిర్ణయించాల్సిన అంశం. అయితే డిఎంకె ఎవరికి మద్దతు ఇస్తారన్న దానిపై చర్చ సాగుతోంది. శశికళకు సిఎం అయ్యే అర్హత లేదని డిఎంకె నేతలు చెబుతున్నారు. అవసరమైతే పన్నీరు సెల్వంకు అంశాలవారీగా మద్దతు ఇస్తామని అన్నాడిఎంకె నేతలు చెబుతున్నట్లు సమాచారం. శశికళను,పన్నీరు సెల్వంను పక్కన బెట్టి, రాష్ట్రపతిపాలన విధిస్తారా అన్నది గవర్నర్ విద్యాసాగర్‌రావు వచ్చిన తరువాత తెలిసే అవకాశం ఉంది.

Comments

comments