Home తాజా వార్తలు ప్రజాప్రతినిధులకు రిటైర్మెంట్ లేదు: వెంకయ్య

ప్రజాప్రతినిధులకు రిటైర్మెంట్ లేదు: వెంకయ్య

Venkaiah-Naidu

హైదరాబాద్: ప్రజా జీవితంలో ఉన్నంతకాలం ప్రజాప్రతినిధులకు రిటైర్మెంట్ లేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ….  జులై నాటికి పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుందని, సభ హుందాతనం, గౌరవం పెంచేందుకు సభ్యులు కృషి చేశారని పేర్కొన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చల్లో సభ్యుల భాగస్వామ్యం కీలకమన్నారు. పదవీకాలం ముగిసిన సభ్యుల్లో కొందరు తిరిగి నియమితులయ్యారని తెలిపారు.  రాజ్యసభలో ఉన్న సభ్యులు దేశానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రజా సమస్యలపై సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. సభలో పలు రంగాల్లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని. ఆ సభ్యులు నిర్మాణాత్మక చర్చల్లో భాగాస్వామ్యం కావాలని సలహా ఇచ్చారు. చైర్మన్‌గా అన్ని పార్టీల సభ్యులు తనకు సమానమేనన్నారు. సభను హుందాగా నిర్వహించేందుకు సభ్యులు సహకరించాలని కోరారు.