Home జోగులాంబ గద్వాల్ గద్వాలలో ‘కారు’ చిచ్చు

గద్వాలలో ‘కారు’ చిచ్చు

పవర్ చుట్టూ పాలి‘ట్రిక్స్’..టిఆర్‌ఎస్‌లో చీలిక
జడ్‌పి, మార్కెట్‌యార్డు చైర్మన్ల  వేరు కుంపటి
అయోమయంలో కింది స్థాయి క్యాడర్

TRS-party

గద్వాలప్రతినిధి: గద్వాల అధికార పార్టీలో ములసం మెదలైంది. నేతలు అంతర్గత కుమ్ములాటలో కొట్టు మిట్టాడుతున్నా ఇప్పటి వరకు గత దశాబ్ద కాలంగా డీకే అరుణభరత్ సింహారెడ్డి, బండ్లకృష్ణమోహన్‌రెడ్డి గ్రూపులు మాత్రమే కనిపించేవి… కాని ఇపుడు నూతనంగా మరోవ ర్గం తయారైంది.. అది కూడ అధికార పార్టీలోనే మొదలైంది… దీంతో నడిగడ్డ లో పవర్ చుట్టూ
పాలిట్రిక్స్ అన్న తరహాలో వేగంగా మారుతు న్నాయి రాజకీయ సమీకరణలు…. గద్వాలలో గత మూడేళ్లుగా అధికార టీఆర్‌ఎస్ పార్టీలో బండ్లకృష్ణమోహన్‌రెడ్డి వర్గంగా కొనసాగుతూ వస్తున్న జట్పీచైర్మన్, మార్కెట్ యార్డు చైర్మన్ వంటి నేతలు బయటకు వెళ్లి కొత్త గ్రూప్‌గా ఏర్పడ్డారు… ఇపుడు ఇదే హాట్ టాపిక్‌గా మా రింది.. మరోవైపు అధికార పార్టీకి చెందిన కిం ది స్థాయి క్యాడర్‌లో అయోమయంలో ఉండ గా… కాంగ్రెస్ పార్టీకి చెందిన డీకే వర్గం ఈ పరిణామాలను నిశితంగా పరిశీస్తున్నారు.
గద్వాలలో కారు చిచ్చు….:గత దశాబ్దకాలం గా అంటే 2005 నుంచి కూడ డీకే భరత్‌సిం హారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలు రెండు గ్రూ పులుగా విడిపోయి ప్రధాన పార్టీలో కొనసా గుతు వస్తున్నారు.. ఈక్రమంలో 2009లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి గా పోటి చేసిన కృష్ణమోహన్‌రెడ్డి పై కాంగ్రెస్ పార్టీకి చెందిన డీకే అరుణ గెలుపొందారు.

తరువాత డీకే అరుణ మంత్రి కావడం గద్వాల లోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో తనదైన శైలీలో చక్రం తిప్పడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ల్లోనే బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. తరువాత డీకే అరుణ వర్గంలో ఉన్న బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి తన సోదరుడు బండ్ల రాజశేఖ ర్‌రెడ్డితో కలిసి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నేతృ త్వంలో వైకాపాలో చేరి బీకేఎంఆర్ వర్గంగా కొనసాగుతూ వచ్చారు.. తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం మారిన సమీకరణాల నేప థ్యంలో కృష్ణమోహన్‌రెడ్డి వర్గం మొత్తం తెరాస పార్టీలో చేరడం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవడం తెలిసిన సంగతు లే. అయితే తరువాత జరిగిన జట్పీ చైర్మన్ ఎన్నికల్లో తగిన మెజార్టీ లేనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా జట్పీ పీఠాన్ని కృష్ణమోహ న్‌రెడ్డి వర్గం చేజిక్కించుకోవడంతో కృష్ణమోహ న్‌రెడ్డికి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెరాస పార్టీలో నే కాకుండా ముఖ్యమంత్రి వద్ద సైతం మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుత మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ భర్త చంద్రశేఖర్‌రెడ్డి కూడ అందరు కలిసికట్టుగానే ఉంటూ రాజకీయాలు చేస్తు వ చ్చారు. అయితే ఎడాది తిరిగేలోపే బండ్ల చం ద్రశేఖర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిల మధ్య చిన్న చిన్న విభేదాలు పొడచూపాయి.. దీనిపై మంత్రి దృష్టికి వెళ్లడం ఇరువురుని కలిసికట్టు గా ఉండాలంటూ సయోధ్య ప్రయత్నం చేయ డం జరిగింది. కొంత కాలంగా అంతర్గతంగా ఎన్ని వైశమ్యాలున్నా బయటకు మాత్రం అం దరు కలిసే ఒకే వర్గంగా ఉంటూ వచ్చేవారు. తరువాత వైశమ్యాలు కాస్త పెద్దవిగా మారడం ఒకరినొకరు పలుకరించలేని స్థాయికి చేరిపో య్యాయి. ఇటివలీ గద్వాల సంబరాల పేరిట జరిగిన ఉత్సవాలల్లో విభేదాలు కాస్త బయటప డ్డాయి…

కృష్ణమోహన్‌రెడ్డి వర్గం గద్వాల సం బరాలను వ్యతిరేకిస్తే…. చంద్రశేఖర్‌రెడ్డి వాళ్లు మద్దతు తెలపడమే కాకుండా క్రీయాశీలంగా పాల్గొన్నారు. అక్కడి నుంచి రెండు గ్రూపులు గా విడిపోయి వేరుకుంపటి పెట్టి.. ఇరువురు నాయకులు కూడ స్థానికంగా జరిగే వివిధ రకాల కార్యక్రమాల్లో తమ ఆదిపత్యాన్ని ప్రద ర్శిస్తు వస్తున్నారు. ఇందులో కృష్ణమోహన్‌రెడ్డి వర్గానిదే పైచేయిగా ఉంది. అయితే ఇటివలీ వరకు కృష్ణమోహన్‌రెడ్డి చెంతన ఉన్న జట్పీ చైర్మన్ భాస్కర్ చంద్రశేఖర్‌రెడ్డి వర్గం వైపు వెళ్లి పోయ్యారు. అధేవిధంగా ఇటిక్యాల జట్పీటీ సీగా ఉన్న ఖగునాథ్‌రెడ్డి కూడ వర్గం మారిపో యి చంద్రశేఖర్‌రెడ్డి వర్గంలో చేరిపోయ్యారు. వీరితోపాటు మాజీ ఎంపీ మంద, గట్టు తిమ్మ ప్ప, వడ్డెపల్లి శ్రీనివాసులు, అలంపూరు మార్కె ట్ యార్డు చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి వంటి ముఖ్య నేతలందరు కూడ మద్దతు తెలిపారు. గత ఆది వారం కృష్ణమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముస్లీం లకు ఇఫ్తార్ విందు ఇస్తే అందులో అయిజకు చెందిన మాజీ జట్పీటీసీ తిరుమల్‌రెడ్డితో పా టు, కృష్ణమోహన్‌రెడ్డి పాత వర్గం హాజరైయ్యా రు.

తరువాత శుక్రవారం చంద్రశేఖర్‌రెడ్డి ఇఫ్తార్‌విందు ఇస్తే దానికి జట్పీచైర్మన్, మాజీ ఎంపీ మంద, బీసీ కమీషన్ సభ్యులు ఆంజనే యులుగౌడు, జట్పీటీసీ ఖగునాథ్‌రెడ్డి, వడ్డేపల్లి శ్రీనివాసులు, గట్టుతిమ్మప్పలందరు హాజరైయి తమ ఆదిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశా రు. పైగా ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ లిద్దరు కూడ హాజరు కావడం చర్చనీ యంశమై ంది. గద్వాలలో జరుగుతున్న ఆదిప త్య వర్గపో రు పార్టీ అధిష్టానానికి తెలియదా….? ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే ఎందుకు తెలియ దు…? మరి తెలిస్తే ఎందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదు…? పార్టీ పెద్దలు, మంత్రులు పోషిస్తున్న మౌన పాత్ర దేనికి సంకే తం…? ఇ దంతా కూడ పార్టీ పెద్దల కనుసన్న ల్లోనే జరు తుందా..?అన్న సందేహాలు వినిపి స్తున్నాయి.?

ఆ ఇద్దరుపై అసంతృప్తి..?: జట్పీ చైర్మన్ పీఠా న్ని కైవసం చేసుకున్న తరువాత పరిపాలన ప రంగా, పార్టీ కార్యాలయంలో జరిగే వ్యవహారా లను చక్కబెట్టేందుకు కృష్ణమోహన్‌రెడ్డి ఇద్దరు వ్యక్తులను నియమించారు. వారిలో ఒకరు ప్ర భుత్వ ఉద్యోగి. అయితే జట్పీ చైర్మన్ సంబం ధంచిన వ్యవహారాలను మొత్తం ముందు నుంచి కృష్ణమోహన్‌రెడ్డే నడిపించారన్నది అందరికి తెలిసిన విషయమే. నిధుల కెటాయింపులు, నియోజకవర్గంలోని సమస్యలు, కింది స్థాయి కార్యకర్తలు, లీడర్ల వరకు అన్ని వ్యవహారాల్లో కృష్ణమోహన్‌రెడ్డిదే అంతిమ నిర్ణయంగా ఉండేది.

దీంతో ఎవరికి ఏ సమస్య వచ్చినా కృష్ణమో హన్‌రెడ్డి ఉన్నారన్న ధీమా పార్టీ క్యాడర్‌లో, దిగువ స్థాయిలో నేతల్లో ఉండేది. అయితే కాల క్రమేణ పరిపాలన పరమైన వ్యవహారాలల్లో కృష్ణమోహన్‌రెడ్డి నియమించిన ఇద్దరు వ్యక్తుల జోక్యం పెరిగింది. వీరిద్దరు అన్ని విషయాల్లో తలదూర్చుతూ పార్టీ క్యాడర్, దిగువ స్థాయి నేతల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తు వచ్చేవారు. కొన్ని సందర్భాల్లో జట్పీచైర్మన్, మండలాలకు చెందిన జట్పీటీసీలు, ఇతర సర్పంచీ స్థాయి నేతల పట్ల నిర్లక్షంగా వ్యవహరించారనే విమ ర్శలున్నాయి. బాధపడే వారు భాదను బయట కు చెప్పుకోలేక లోలోపలనే మధనపడుతూ వస్తున్నారు. అయితే రాజకీయ సమీకరణలు మారిపోవడంతో లోలోపల బాధపడుతు వస్తున్న నేతలందరు ఒక్కోక్కరుగా బయటకు వెళ్లడం మొదలుపెట్టారనే గాసిప్స్ వినిపిస్తున్నా యి. మరో వైపు కృష్ణమోహన్‌రెడ్డి ద్వారా పదవులను పొందిన నేతలు ఇలా మోసం చేసి ప్లేటు ఫిరాయింపులేంటి అనే విమర్శలు సైతం జోరుగా వినిపిస్తున్నాయి. నేతల గోడ దూకే ఆట ఏనేత వరకు వచ్చి ఆగుతుందో.. గద్వాల రాజకీయాలు మరెంత రంజుగా మారుతా య్యో… చూడాలి మరి.?