Home జాతీయ వార్తలు పార్లమెంటులోనూ చీరలు, మేకప్‌లపై ముచ్చట్లు : సుప్రియా సూలె

పార్లమెంటులోనూ చీరలు, మేకప్‌లపై ముచ్చట్లు : సుప్రియా సూలె

supriyaనాసిక్: క్లాస్‌రూమ్  గాసిప్స్ గురించి అందరికీ తెలుసు. ప్రజా సమస్యలు, సీరియస్  అంశాలపై చర్చించాల్సిన పార్లమెంటు కూడా ఇందుకు భిన్నం కాదట. లోక్‌సభ ఎంపి, నేషనలిస్ట్  కాంగ్రెస్  పార్టీ (ఎన్‌సిపి) సీనియర్  నేత సుప్రియా సూలె మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థినులతో మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా ఎంపిల గాసిప్స్ ముచ్చట్లపై ఒకింత సంచలన వ్యాఖ్యలే చేశారు. ‘నేను పార్లమెంటుకు వెళ్లినప్పుడు మొద టి స్పీచ్  విన్నాను. ఆ తర్వాత మరో రెండు విన్నాను. స్పీకర్ వాటిని కోడ్రీకిరించి నాలుగో ప్రసంగం చేశారు. అయితే స్పీకర్  ఏమి చెప్పారని అడిగితే నాకు ఏదీ గుర్తులేదని చెప్తాను’ అని అన్నారు. క్లాస్‌రూమ్‌లో గాసిప్స్ సర్వ సాధారణమే అని, పార్లమెంటులోనూ ఇతర ఎంపిలపై కూడా ఇలాంటి గాసిప్లే నడుస్తుంటాయని అన్నారు. టివి ల్లో వీక్షించే ప్రజలు జాతీయ అంశాలపై ఎంపిలు మాట్లాడుతున్నారని అనుకుంటారని అన్నారు. ‘నేను చెన్నైకి చెందిన ఎంపితో మాట్లాడుతుంటే చెన్నైలో వర్షాల మీద సీరియస్‌గా మేము చర్చించుకుంటున్నామని మీరు అను కుంటారు. అయితే అక్కడ అలాంటిదేమీ ఉండదు. ఈ చీర మీరు ఎక్కడి నుంచి తెప్పించారు, నా చీర ఎక్కడ నుంచి తెప్పించాను అనే విషయాలపైనే గాసిప్స్ నడుస్తుంటాయి. మీరు కూడా క్లాస్‌రూంలో ఇలాంటి గాసిప్స్ మాట్లాడు తుంటారు కదా’ అని సుప్రియ సూలె విద్యార్థినులను ఉద్దేశించి ప్రశ్నించారు.