Home జాతీయ వార్తలు పాఠాలు చెప్పిన పాలకులు

పాఠాలు చెప్పిన పాలకులు

నన్ను సార్ అని పిలవండి టీచర్ అవతారం ఎత్తాలని కేజ్రీవాల్ 
సూచించారు బాల్యంలో ఐదు కిలోమీటర్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవాళ్లం
నా మొదటి గురువు తల్లి తొలి సార్వత్రిక ఎన్నికల్లో 17.5 కోట్ల మంది ఓటు వేశారు : రాష్ట్రపతి ప్రణబ్
తల్లి జన్మనిస్తుంది.. గురువు బతుకునిస్తాడు 
ఉపాధ్యాయుడికి విద్యార్థుల వల్లే గుర్తింపు 
కలాం అధ్యాపకుడి పాత్రలో ఆనందించేవారు 
వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రజ్ఞుల విజయాల వెనుక టీచర్ల పాత్ర ఉంది 
నాకు ఫ్యాషన్ డిజైనర్ లేరు 
నా కుర్తా నేనే ఇస్త్రీ చేసుకునేవాడిని : ప్రధాని

123

 

న్యూఢిల్లీ : విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయునిదే ప్రధాన పాత్ర అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఓ ఉత్తము ఉపాధ్యాయుడికి ఆయన విద్యార్థులే గుర్తుగా నిలుస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశరాజధానిలోని మానెక్‌షా ఆడిటోరియంలో ఆయన స్కూలు విద్యార్థు లతో మనసువిప్పి మాట్లాడారు. వారు దాపరికం లేకుండా అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులు ఇచ్చారు. తల్లి బిడ్డకు జన్మనిస్తే, గురువు జీవనదానం చేస్తాడని పేర్కొన్నారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఏ మేరకు గుర్తింపు దక్కుతుందనేది ఓ కీలక ప్రశ్నగానే మారిందని, ఓ డాక్టరు ఒకరి ప్రాణం నిలిపితే, ఆయన ఫోటోను ప్రచురిస్తారని, కానీ ఓ టీచర్ వందలాది మంది డాక్టర్లను, ఇంజినీర్లను తయారు చేస్తే చివరికి ఆయనకు దక్కే గుర్తింపు ఏముందని ప్రశ్నించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను గుర్తిం చి, వారిని సన్మానించుకునే అవకాశం లభిస్తుందని, అయితే ఇది అన్ని దశలలో జరగాల్సి ఉందని పిలుపు నిచ్చారు. విద్యార్థుల పట్ల తన ప్రతిభను పెట్టుబడిగా పెట్టని టీచర్ సంపూర్ణ టీచర్ కాలేడని చెప్పిన ప్రధాని ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాంను ప్రస్తావించారు. కలాం తరచూ తనను ఓ ఉపాధ్యాయుడి గా గుర్తుంచుకుంటే బాగుంటుందని చెప్పేవారని గుర్తు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా జరిగే ఉపాధ్యాయ దినోత్సవం గుర్తుగా ప్రధాని మోడీ రూ125, రూ 100 నాణేలను విడుదల చేశారు. కళా ఉత్సవ్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. విద్యార్థులతో ప్రధా ని మోడీ ఇష్టాగోష్టి ముప్పావు గంట జరిగింది.
ప్రతిభావంతులు రాజకీయాలలోకి రావాలి….
ప్రస్తుతం రాజకీయాలకు చెడ్డపేరు రావడం పట్ల ప్రధాని విచారం వ్యక్తం చేశారు. అందుకే మంచి వారు, తెలివైన వారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని , అన్ని వర్గాల నుంచి ఉత్తములు రాజకీయాలలోకి చేరడం వల్ల దేశం బాగుపడుతుందని, రాజకీయాలపై భయాలు వద్ద ని తెలిపారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను అల వర్చుకోవాలని, హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ వారికి తానో ప్రతిపాదన చేస్తున్నానని , స్కూళ్లలో విద్యార్థులకు క్యారె క్టర్ సర్టిఫికెట్లకు బదులు, వారి అభిరుచులకు సంబం ధించిన సర్టిఫికెట్లు ఇవ్వడం మంచిదని వారికి సూచి స్తున్నట్లు తెలిపారు. దీనివల్ల విద్యార్థులు స్కూళ్ల నుంచి వెలుపలికి వచ్చినప్పుడు వారి వ్యక్తిత్వం గురించి, వారి అభిరుచుల గురించి స్పష్టం అవుతుందని చెప్పారు.
నిరంతర విద్యుత్ సరఫరా లక్షం …
దేశవ్యాప్తంగా 2022 నాటికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలనేదే తమ ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని ప్రధాని తెలిపారు. డిజిటల్ ఇండియా ఇతర కీలక లక్షాలను చేరుకోవడానికి విద్యుత్ కీలకం అని చెప్పారు. సామాన్యుడి సాధికారతకే డిజిటల్ ఇండియా తలపెట్టినట్లు, పారదర్శకతకు ఇది అనువైన మార్గం అని తెలిపారు. నిరంతర విద్యుత్ వల్లనే అన్ని రంగాలలో అనుకున్న విధంగా మార్పులు సాధించుకోవచ్చునని, ఇళ్లలోని చీకట్లను తొలగించే క్రమంలో చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన సార్థక్ భరద్వాజ్ అనే విద్యార్థి దేశంలో ఇప్పటికీ పలు ప్రాంతాలలో విద్యుత్ లేని పరిస్థితిలో డిజిటల్ ఇండియా ఎలా సాధ్యం అవుతుందని నిలదీసిన సందర్భంగా ప్రధాని ఆ విద్యార్థితో ఏకీభవించి, దేశంలో ముందుగా నిరంతర విద్యుత్ అత్యవసరం అని స్పష్టం చేశారు.
పూర్ణ విద్యార్థి లోకానికి స్ఫూర్తి ప్రధాత ….
చిన్న వయస్సులోనే ఎవరెస్టును ఎక్కటం ఎంతో గొప్ప విషయం.. ఇంతటి ఘనకార్యం సాధించిన మలావత్ పూర్ణ విద్యార్థి లోకానికి స్ఫూర్తి ప్రధాత అని భారత ప్రధాని నరేంద్ర మోది పూర్ణను అభినందించారు. ఉపా ధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ రాష్ట్రాలలో శాస్త్ర, సాంకేతిక అంశాలు, ధైర్య సాహాసాలతో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. అందులో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ లోని ఎన్‌ఐసీలోని వీసీ ద్వారా పూర్ణతో ముచ్చటించారు. మారుమూల ప్రాంతం నుంచి ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతూ ఎవరెస్టును అధిరోహించటం గర్వకారణం అని అన్నారు.

పొరుగు దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియ తెలుసుకోండి …

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం హిస్టరీ టీచర్‌గా మారాడు. ఉపాధ్యాయ దినోత్సవ నేపథ్యంలో దేశంలో రాష్ట్రపతి గురువుగా మారి విద్యార్థులకు పాఠం చెప్పడం ఇదే మొదటిసారి. తాను టీచర్ అవతారం ఎత్తాలనే క్రూరమైన సూచన చేసింది సిఎం కేజ్రీవాల్ అని ప్రణబ్ ఈ సందర్భంగా చమత్కరించారు. భారత రాజకీయ చరిత్రను పాఠంగా ఎంచుకుని ప్రణబ్ విద్యార్థులకు పలు విషయాలు వివరించారు. మధ్యమధ్యలో సామాజిక మాధ్యమం, మీడియా, ఎన్‌జిఒల గురించి ప్రస్తావించారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామిక పటిష్టతకు కీలకం అన్నారు. మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే అంశాలలో మీడియా, స్వచ్ఛంద సేవాసంస్థల పాత్ర కూడా కీలకంగా మారిందని తెలిపారు. రాష్ట్రపతి తమ గంట సేపు పాఠంలో భారతీయ రాజ్యాంగం గురించి ప్రస్తావించారు. రాజ్యాంగం మార్పులకు వీలైన డాక్యు మెంట్ అని, ఇందులో సంవత్సరాలుగా పలు మార్పు లు జరిగాయని తెలిపారు. విద్యార్థులు పొరుగు దేశాలలో ప్రజాస్వామిక ప్రక్రియ ఎలా ఉందనేది తెలుసుకోవాలని సూచించారు.