Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

వాటి ప్రభావం మా బంధంపై పడదు

Kamal-Hasan

చెన్నై: తమిళ విలక్షణ నటుడు కమల్ హాసన్ ఇటీవల పార్టీ పెట్టగా, సూపర్ స్టార్ రాజనీకాంత్ కూడా త్వరలో పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి సినీ బంధానికి సంబంధించిన విషయాలను కమల్ ప్రేక్షకులతో పంచకున్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. రజనీ, నేను చాలా సినిమాల్లో నటించామని.. నేను చేసిన పాత్రలు ఆయన చేయలేదు, ఆయన చేసిన పాత్రలు నేను చేయలేదన్నారు. మా ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు వేరైనా ప్రేక్షకులను అలరించడమే మా ఉద్దేశమని చెప్పారు. ఇప్పటి వరకూ ఇద్దరం సినీరంగంలో కలిసే ఉన్నామన్నారు. ఇప్పుడు ఇద్దరం రాజీయాల్లోకి వచ్చామని, రాజకీయాలు మమ్మల్ని వేరు చేసినా వాటి ప్రభావం మాత్రం మా బంధంపై పడదన్నారు. మేమిద్దరం రాజకీయంగా మాత్రమే వేరని ఈ సందర్భంగా కమల్ పేర్కొన్నారు.

Comments

comments