Home తాజా వార్తలు మధ్యప్రదేశ్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

మధ్యప్రదేశ్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు

Voters

భోపాల్: మధ్యప్రదేశ్ లో శనివారం ఉదయం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్  ప్రారంభమైంది. మున్గోలి, కొలరాస్ శాసన సభ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతుంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఆ రెండు సీట్లను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపి జ్యోతిరాదిత్య సింథియా నియోజకవర్గంలో ఈ రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ  ఉప ఎన్నిక రెండు పార్టీల మధ్య పోటీ కాదని  మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహన్, తన మధ్య పోటీ అని ప్రచారంలో జ్యోతిరాదిత్య సింధియా సవాలు విసిరారు. ఓటర్లు ఓట్లు వేసేందుకు బారులు తీరారు.