Home నవ విజ్ఞానం హెచ్‌ఐవి, స్మోకింగ్ కన్నాకాలుష్యం డేంజర్

హెచ్‌ఐవి, స్మోకింగ్ కన్నాకాలుష్యం డేంజర్

Pollution

వాషింగ్టన్: హెచ్‌ఐవి, స్మోకింగ్, ఉగ్రవాదం కన్నా కాలుష్యం అత్యంత ప్రమాదమని, మనిషి జీవిత కాల ప్రమాణంపై తీవ్రప్రభావం చూపిస్తుందని అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించిన ప్రమాణాలను దేశం పాటిస్తే భారతీయుల జీవిత కాలం మరో మూడు నాలుగేళ్లు పెరుగుతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఎక్యుఎల్‌ఐ) వెల్లడించింది. వాయు కాలుష్యం వల్ల ప్రపంచంలో సరాసరిన మనిషి జీవిత కాలం 1.8 సంవత్సరాలు తగ్గిపోతుందని చికాగో యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.  ప్రపంచ జనాభాలో 36 శాతం చైనా, భారత్ ప్రజలే. జీవితానికి సంబంధించిన మొత్తం సంవత్సరాల్లో 73 శాతం జీవితం కాలుష్యం వల్లనే కోల్పోవడమవుతోందని ఎక్యుఎల్‌ఐ వెల్లడించింది.

టిబి, హెచ్‌ఐవి, ఎయిడ్స్, తదితర ప్రాణాంతక అంటువ్యాధుల కారణంగా చనిపోయే సంఖ్య కన్నా కాలుష్యం వల్ల ఎదురయ్యే ప్రమాదం చాలా ఘోరమని పేర్కొంది. ప్రపంచ జనాభాలో 75 శాతం మంది ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల పరిమితికి మించి కాలుష్యం విస్తరించిన ప్రాంతాల్లో ఉంటున్నారని ఈ కాలుష్యం సరాసరి 1.8 సంవత్సరాల జీవితకాలాన్ని తగ్గిస్తుందని ఎక్యుఎల్‌ఐ వెల్లడించింది.

స్మోకింగ్ వల్ల 1.6 సంవత్సరాలు, ఆల్కహాలు, డ్రగ్స్ వల్ల 11 నెలలు, కలుషితమైన నీరు, అపారిశుద్ధం వల్ల 7నెలలు హెచ్‌ఐవి, ఎయిడ్స్ వల్ల 4 నెలలు ఘర్షణ, ఉగ్రవాదం వల్ల 22 రోజులు సరాసరిన జీవితకాలం తగ్గుతుందని వెల్లడైంది. అందువల్ల జీవిత కాలప్రమాణంపై కాలుష్య ప్రభావం ఏమాత్రం అని పరిశీలిస్తే స్మోకింగ్, ఆల్కహాలు, డ్రగ్స్ కన్నా  రెట్టింపు, కలుషిత నీటి కన్నా మూడు రెట్లు,హెచ్‌ఐవి ఎయిడ్స్ కన్నా ఐదు రెట్లు, సంఘర్షణ, ఉగ్రవాదం కన్నా 25 రెట్లు కాలుష్య ప్రభావం జీవితకాలంపై ఉంటుందని ఎక్యుఎల్‌ఐ వెల్లడించింది.

Pollution is Most Dangerous Than HIV, Smoking says study

telangana latest news

-సైన్స్ విభాగం