Home పెద్దపల్లి కాలుష్య వలయంలో ప్రభావిత గ్రామాలు

కాలుష్య వలయంలో ప్రభావిత గ్రామాలు

కార్మిక సంఘాల నాయకుల ఆరాటం అంతా కార్మికుల హక్కుల కొరకేనా?
కేశోరాం కర్మాగారం చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు
అక్కడి కార్మికుల హక్కులు అమలయ్యేదెప్పుడో?

Pollutionపాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పరిధిలోని బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం తెలంగాణ ప్రాంతంలోని ఏకైక ప్రైవేటు పరిశ్రమగా విరాజిల్లుతోంది. అక్కడ 206 మంది పర్మినెంట్ కార్మికులుగా మరో 1200 మంది కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వ హిస్తున్నారు. అంతే కాకుండా మరో 500మంది ఉద్యోగులుగా ఉపాధి పొందుతున్నారు. కేశోరాం కర్మాగారం కాలుష్య విషవలయంలో ప్రభావిత గ్రామాల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారనే ఆరోప ణలు సైతం లేక పోలేదు. ఎన్నికలకు ముందు పోటీ చేస్తున్న కార్మిక సంఘాల నాయకుల ఆరాటం అంతా నిజంగా కార్మికుల హక్కుల కొరకేనా అని చర్చించుకోవడం కూడా ఇక్కడ ఆనవాయితీగా మారుతోంది.

గ్రామాల్లో సమస్యలను గాలికి వదిలి కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఫ్యాక్టరీ చుట్టూ ప్రదిక్షణలు చేయడం ఏమిటని ఆరోపణలను సైతం వారు మూటకట్టుకోవటం పట్ల సర్వ్రతా కా ర్మికుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా ప్రతీ రెండు సంవత్సరాలకోమారు ఇక్కడ జరిగే కాం ట్రాక్టు వర్కర్స్ యూనియన్, పర్మినెంట్ వర్కర్స్ యూనియన్‌ల ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులం తా నేటి వరకు ఎన్నికలకు ముందు హీరోలుగా ఫోజులిచ్చి అటు తర్వాత యాజమాన్యం ముందు మో కారిల్లుతూ పిల్లుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం లేకపోలేదు. కాగా పరిశ్రమ సమీప ప్రభా విత గ్రామాలైన పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి, కన్నాల, కొత్తపల్లి, రామారావుపల్లె తదితర గ్రామాల్లోని ప్రజలకు కర్మాగారం నుండి వెదజల్లే దుమ్ముధూళితో పాటు విషవాయువులతో తల్లడిల్లుతున్నారు.

అ యినా అక్కడ విధులు నిర్వహించే కార్మికులు నాటి నుంచి నేటి వరకు అలుపెరగకుండా హక్కుల కో సం పోరాడుతూనే ఉన్నారు. అక్కడి కార్మికులకు, కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న సం ఘాల నాయకులు చేస్తున్న ఆరాటమంతాఅక్కడి కార్మికుల హక్కుల కొరకేనా, వాస్తవంగా కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు పట్టుదలతో ప్రయత్నిస్తే యాజమాన్యం కార్మికుల హక్కులను యే ళ్లు గడుస్తున్నా ఎందుకు నెరవేర్చడంలేదో, అనునిత్యం కార్మికుల హక్కుల కోసమే పోరాడుతున్నా మని ఉపన్యాసాలతో ఉరకలెత్తించే నాయకులు, కార్మికులకు ఏమి జవాబు ఇస్తారో ఎదురుచూడా ల్సిందేనా? ఇక్కడ జరుగుతున్న అటు వర్కర్స్ యూనియన్, ఇటు పర్మినెంట్ వర్కర్స్ యూనియ న్లకు నాడు నాయకత్వం వహించిన అతిరథమహారథులు నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో క్రి యాశీలక పాత్ర పోషిస్తూ పలు రాజకీయ పార్టీలలోని వారే కావడం గమనార్హం.

అయినప్పటికీ పనిచేస్తున్న కార్మికులు నేటి వరకు తమతమ హక్కుల కోసం పోరాటాలు మా త్రం నిర్వహించటం తప్పడం లేదు. ఎన్నికలకు ముందు ఈ రెండు యూనియన్లకు పోటీ చే స్తున్న అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అభ్యర్థులు మాత్రం ఎన్నో హామీలను గుప్పిస్తూ సార్వత్రి క ఎన్నికలను సైతం మైమరిపించే విధంగా మంది మార్భలంతో, అనుచరవర్గం పోటాపో టీగా పత్రిక సమావేశాలు ఏర్పాటు చేసుకుని, ద్వార సమావేశాలను నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు బురద జల్లుకునే విధంగా నైతిక దిగజారుడుకు నిదర్శనంగా నిలవడం కార్మికులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేయడంపై చూపించే శ్రద్ధలో కొంతమేరకైనా హక్కుల సాధన పోరాటంలో చూపించినా నేడు కార్మికుల హక్కులు అనే పదానికి నిర్వచనం ఉండక పోయేదేమో అని విమర్శలు ఉన్నాయి.

కార్మికులు తమ శ్రమశక్తితో యాజమాన్యానికి ఎన్నో అవార్డుల పంట పండించినా ఇక్కడి వ ర్కర్లు మాత్రం అరకొర వసతులతో అగ్గిపెట్టెలాంటి క్వార్టర్లలో కాలం వెళ్లదీయ డమే కాకుండా పందులు బొర్లుతున్న పార్కులు మందు బాబులకు అడ్డాలు గా మారుతున్న వైనం మరోవైపు ఉండగా హక్కుల కోసం పోరాడే నాయ కులకు ఈ సమస్యలు కానరాకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రభావిత గ్రామాల కు చెందిన యువకులు ఈసాలతక్కళ్లపల్లి గ్రామంలోని హైస్కూల్ ఆవరణలో పూర్వ, ప్రస్తుత ప్రజాప్రతినిధులతో తొలి సమావే శం ఏర్పాటు చేసుకుని ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కర్మాగారంపై తిరుగుబాటుకు తెరలేపారు. కంపెనీ వల్ల జరుగుతున్న పలు నష్టాలను వివరి స్తూ స్థానిక తహసీల్దారు నుంచి మొదలుకొని చీఫ్ సెక్రటరీ వరకు ఫిర్యాదు పత్రా లను అందించటంతో పాటు స మాచారహక్కుల చట్టం కింద కర్మాగారినికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, తదితర అంశాలపై వివరాలు సేకరిం చ డంతో పాటు కంపెనీ వల్ల గ్రామాలు కరువుతో, కాలుష్యతంతో కొట్టుమిట్టాడుతున్నాయని మైన్స్‌లో చేస్తున్న భారీ బ్లాస్టింగ్‌ల వల్ల నివాస గృహాలు దెబ్బతింటున్నాయని, ప్రకృతి సహజ సిద్ధంగా సమీప గుట్టల నుంచి వచ్చే వర్షపు నీటిని సైతం అక్రమంగా అడ్డుకుని కర్మాగారం అవ సరాలకు వినియోగించుకుంటోందని ఫిర్యాదలు చేసిన దాఖాలలు సైతం లేకపోలేదు.

భూగర్భ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా బిర్లా యాజమాన్యానికి నోటీసులు పంపించిన సందర్భాలు ఉ న్నాయని చెప్పుకుంటున్నారు. కర్మాగారం నిర్వహిస్తున్న బ్లాసింగ్‌ల వల్ల వ్యవసాయ బావులు దెబ్బ తినడమే కాకుండా సాగునీరు సైతం కలుషితమవుతున్నదని, దుమ్ము ధూళితో సమీప గ్రామా ప్రజ లు అనారోగ్యాలకు గురవుతున్నారని 50 ఏళ్లుగా ఇక్కడి పరిశ్రమ ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో విఫలమైందని ఆందోళనలు సైతం నిర్వహించారంటే ఈ పరిశ్రమ వల్ల ఈ ప్రాంతానికి మంచి కంటే చెడే ఎక్కువగా ఉందని వాధించేవారు లేకపోలేదు.
ఆనాడు ప్రభావిత గ్రామాల యువత యాజమాన్యాన్ని నిలదీసి ప్రశ్నించినపుడు వారు చేసిన పోరా టాలకు అడుగడుగునా కేశోరాం యాజమాన్యం అడ్డుపడ్డా, కార్మికుల హక్కుల కోసం నిరంతరం అ లుపెరుగని పోరాటాలు చేస్తున్నామని చెప్పుకునే ఈనాటి నాయకులు గ్రామాల ప్రభావిత యువతకు ఏమేరకు మద్ధతునిచ్చారో వారికే తెలియాలి.

ఇక్కడ ప్రతీ రెండు సంవత్సరాలకోమారు జరిగే ఎన్నిక లకు ముందు ఒకరినొకరు విమర్శలు, ప్రతివిమర్శలతో కాలం వెల్లదీయడం వారికి వెన్నెతో పెట్టిన విద్యలాగే మారింది. ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు కార్మికుల సంక్షేమం, హక్కుల కొరకు నిస్వార్థంగా పనిచేయడంతో పాటు ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తూ కాలుష్య నివారణ చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టే దిశగా యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి రానున్న కాలంలో ఆందోళనలు అనే మాటే ఎవ్వరూ ఎత్తకుండా ప్రశాంతంగా ఉంచే కార్మిక సం ఘాల నాయకత్వం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.