Home తాజా వార్తలు వరంగల్ నగరానికి మురికి నీటి కాలుష్యం

వరంగల్ నగరానికి మురికి నీటి కాలుష్యం

Drainage water

 

వాగులు, వంకల ద్వారా పంటపొలాలకు చేరుతున్న మురికినీరు

ముందుచూపులేని పాలకవర్గాలు

మనతెలంగాణ/వరంగల్ బ్యూరో: పట్టణాల నుండి వస్తున్న మురికి నీ రు మానవజీవితానికే పెను సవాల్‌గా మారుతుంది. పట్టణీకరణ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో నివాస ప్రాంతాల వారికే పరిశుభ్రత పాటిస్తున్న ప్రజలు వదులుతున్న వ్యర్థాలు, మురికినీటితో కాలుష్యం కొరలు కక్కుతుంది. కాలుష్యరహితంగా ఉన్న పట్టణ, గ్రా మీణ ప్రాంతాలు నేడు దాని బారిన పడుతున్నాయి. పాలకులకు ముం దుచూపు లేకపోవడం వల్లనే పట్టణంలోని మురికి నీరు, వ్యర్థాలు, పరిశ్రమల రసాయనాలతో కూడిన నీరు కూడా ప్రధాన కాలువల్లో చేరుతుం ది. ఆనీరు పంట పొలాలకు ఉపయోగించడం వల్ల తినే ఆహారం కూడా క లుషితమైపోతుంది. చెరువులు, కుంటల్లోకి చేరిన మురికినీటి వల్ల చెరువులో ఉన్న మత్స సంపద కూడా విషపూరితమైన సంపదగా మారిపోతుంది. ఇప్పటికే దీనిపై ప్రజలకు అవగాహన వచ్చి మురికినీటి పరిసర ప్రాంతాల చెరువులు, కుంటలు, వాగుల ద్వారా సాగైన పంటల ఉత్పత్తులు కాని మత్స సంపదకు ప్రజలు దూరంగా ఉం టున్నారు.

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రధానంగా వరంగల్ అర్బన్‌తోపాటు మిగతా జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీ, నగర పంచాయతీ మండల కేంద్రాలు ఈ కోవలోకి వస్తున్నాయి. 30 వేల నుండి 50 వేల పైచిలుకు జనా భా కలిగిన పట్టణాల్లో ఈ పరిస్థితి కొట్టచ్చినట్లు కనపడుతుంది. ఒకవైపు వాహనాల ద్వారా కాలుష్యం పెరిగిపోతుండగా మరో వైపు మురికినీరు, వ్యర్థాలు, పారిశ్రామిక వాడల నుండి వస్తున్న రసాయనిక మురికి నీరు కూడా ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, జనగాం, డోర్నకల్, మంగపేట, కమలాపూర్, స్టేషన్‌ఘన్‌పూర్, తొర్రూర్ లాంటి పట్టణాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉం ది. నియోజకవర్గ కేంద్రాలుగా ఉన్న పట్టణాలన్నీ డివిజన్ కేంద్రాలుగా నగరపంచాయతీ నుండి మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ప్రజలు చెల్లిస్తున్న పన్నులకు అనుగుణంగా కాలుష్య రహిత వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమవుతూ వస్తున్నారు. గత 30 సంవత్సరాల నుండి పాలకులు అనుసరిస్తున్న నిర్లక్ష వైఖరికి నేడు ప్రజలు భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

పట్టణాలన్నీ మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణం జరగకపోవడం పెద్ద తప్పిదంగా భావించవచ్చు. డ్రైనేజీ వ్యవస్థ ను గత ప్రభుత్వాలు నిర్లక్షం చేయడం వల్ల ఈ సమ స్య ఉత్పన్నమవుతుంది. పట్టణాల్లో వాడవాడకు డ్రైనేజీలను నిర్మించడం వల్ల ఇండ్ల నుండి వచ్చిన మురికి నీరు, వ్యర్థాలు, నేరుగా పట్టణ శివారు ప్రాంతాల్లోకి చేరుతుంది. అక్కడి నుండి ఆ నీరు పంటపొలాలకు ఉపయోగిస్తున్న పంట కాలువలల్లో కలుస్తుంది. దాని వల్ల పంట కాలువల స్వచ్ఛమైన నీరు కూడా కలుషితమై ఆనీరు నేరుగా పంటపొలాల్లోకి చేరుతుంది. కొన్నిచోట్ల కలుషితమైన నీటిని వాగుల ద్వారా పైపులైన్లతో నల్లానీటికి ఉపయోగిస్తున్న ప్రదేశాలు కూడా ఉన్నాయి. మురికినీటికి సమానంగా పరిశ్రమల రసాయనిక నీరు కూడా నేరుగా వ్యవసాయ పంట కాలువల్లో కలుస్తుంది. ఆనీటితో పంటపొలాల్లోకి రావడం వల్ల పంటల దిగుబడిపై ప్రభావం చూపుతుంది అలాంటి ఉత్పత్తులను ఆహారంగా తీసుకున్న ప్రజలు కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రధాన వాగుల్లోకి చేరిన నీటిని సేవిస్తున్న పశువులకు వాటిని వాడుతున్న రైతులకు చర్మవ్యాధులు, ఇతర వ్యాధులు సోకుతున్నాయని గతంలో అనేక మంది కోర్టుల్లో కూడా కేసులు వేశారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఉమ్మడి జిల్లాపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. పాలకులు దీనిపై దృష్టిని కేంద్రీకరించకపోతే వస్తున్న దుష్పలితాలు మరింతగా పెరగనుంది.

మురికినీటికి పరిష్కారం చూపాలి…
పట్టణాల నుండి వస్తున్న రసాయనిక మురికి నీటికి పరిష్కారం చూపకపోతే సమాజంలో అనేక దుష్ఫలితాలను చూడాల్సి వస్తుంది. మురికినీరంతా కూడా ఒకే ప్రాంతానికి, 2, 3 పాయింట్లకు వచ్చే విధంగా మాస్టర్ ప్లాన్ డిజైన్‌ను రూపొందించి ఆనీటిని శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ప్రధానంగా ఆనీరు పంట పొలాలకు వాగులు, వంకల్లోకి వెళ్లకుండా చూడగలగాలి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు వస్తున్న మురికినీరంతా కూడా వరంగల్ రూరల్ జిల్లాను తీసుకుంటే పరకాల మురికినీరంతా కూడా దగ్గరలో ఉన్న వాగుల్లోకి ప్రవహిస్తుంది. నర్సంపేట మున్సిపాలిటిలోని మురికినీరంతా కూడా పంట కాలువల నుండి వట్టె వాగు ద్వారా మున్నేరు కాలువలో కలుస్తుంది. ఈ మున్నేరు కాలువ మహబూబాబాద్ డోర్నకల్ వరకు ప్రవహిస్తుంది. ఆ పట్టణాల నీరు కూడా అందులోకే వెళుతున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Pollution with Dirty water to Warangal city