Home మంచిర్యాల పట్టణాల నిండా పాలిథీన్ భూతం

పట్టణాల నిండా పాలిథీన్ భూతం

అమలు కాని నిషేధాజ్ఞలు
నష్టమని తెలిసినా ఆగని వినియోగం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేవు
అధికారుల నుంచి చర్యలు కరువు

Polython-Cover

మంచిర్యాలప్రతినిధి: పర్యావరణానికి పె నుముప్పుగా పరిణమించిన పాలిథీన్ కవర్లు పట్టణాల నిం డా పరుచుకుంటున్నాయి. ప్రమాదమని తెలిసినా ప్రజలు, వ్యాపారులు యథేచ్ఛగా వాడుతూనే ఉన్నారు. నిత్యం ఇళ్ల నుంచి వస్తున్న చెత్తలో 80శాతం వాటా దానిదే కావటం పొంచి ఉన్న ముప్పునకు అద్దం పడుతోంది. పొరపొరలుగా పొగుబడి చుక్క నీరు కూడా భూమిలోకి ఇంకని పరిస్దితి నెలకొంది. కాల్వల్లో మురుగు ముందుకు వెళ్లకుండా అ డ్డుపడుతోంది. కవర్లను కాల్చటం వల్ల వచ్చే ఆరోగ్య సమ స్యలు అదనం.

ఇన్ని రూపాల్లో పాలిథీన్ భూతం విజృంభి స్తున్నా అధికారుల నుంచి చర్యలు ఉండటం లేదు. ఫలితం గా ఒకప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన జిల్లా కేంద్రం నేడు అధ్వానంగా తయారైంది. రంగుల కవర్లు,20 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల కవర్లు వాడరాదని నిబంధనలు న్నాయి. కానీ జిల్లా కేంద్రంలో ఏ దుకాణానికి వెళ్లినా అవే కనిపిస్తాయి. మంచిర్యాల పురపాలకలో సుమారు 500కి పైగా వ్యాపార సముదాయాలు ఉన్నాయి. కిరాణం.హోట ళ్ళు, ఎరువులు,పురుగు మందులు మెడికల్, పండ్లు, మాం సం దుకాణాల్లో ప్రతిరోజు పాలిథీన్ కవర్లను వినియోగిస్తు న్నారు. కవర్లకు ప్రత్యామ్నాయంగా నారా సంచులు ,కాగి తం సంచులను అందుబాటులోకి తీసుకురావడంతో అధికా రులు,ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. ప్రజా చైతన్య కా ర్యక్రమాలు కూడా కరవయ్యాయి.

ఫలితంగా పాలిథీన్ ని షేధాజ్ఞలు బుట్టదాఖలయ్యాయి. ఒక్క మంచిర్యాలనే రోజు కు సగటున వందకిలోల కవర్లు వాడుతున్నట్లు అంచనా. ఈ లెక్కన నెలకు 30 క్వింటాళ్ళ వరకు కవర్లు పోగవుతు న్నాయి. ఈ ఐదేళ్లలో పాలిథిన్ కవర్ల వినియోగం విప రీతంగా పెరిగిపోయింది.ఇన్నాళ్లు రెగ్యూలర్ కమిషనర్ లేక నిషేధం అమలు చేసే వారే కరవయ్యారు. పురపాలిక కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ హోల్‌సెల్ వ్యాపా రులకు అండగా నిలవడంతో పాలిథీన్ కవర్ల వినియోగం తీవ్రరూపం దాల్చింది. అయిజ నగర పంచాయితీలోను ఇ దే పరిస్దితి నెలకొంది.

చిన్నస్వార్ధం…ఎన్నో అనర్దాలు

మనబద్దకం, స్వార్దంతో వాడుతున్న చిన్న కవరు అనేక అన ర్దాలకు కారణమవుతోంది. మంచిర్యాలలో డంప్‌యార్డులు లేక పోవడంతో పట్టణాల్లోని చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారబోస్తున్నారు. అందులో 80శాతం వరకు పాలిథిన్ కవ ర్లే ఉంటున్నాయి. చెత్త నిర్వాహణ లేక పోవడంతో కవర్లన్ని భూమిలో కలవటానికి వందల ఏళ్లు పడుతుంది. భవిష్య త్తులో ఇది అనేక సమస్యలు తెచ్చే ప్రమాదముంది. కొన్ని చోట్ల చెత్తను తీసుకెళ్లకుండా పారిశుద్ధ్ద సిబ్బంది అక్కడే కాలుస్తుండటంతో ప్రమాదకరమైన వాయువులు గాలిలో కలిసి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శ్వాశ కోశ వ్యాధులకు కూడా దారితీస్తుంది. మన అవసరార్దం వాడే కవర్లను ఆవులు, మేకలు వంటి మూగజీవాలు తిని జీర్ణంకాక చనిపోతున్నాయి. ఆహార