Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

దానిమ్మతో చర్మసమస్యలు దూరం

వైద్య గుణాలు కలిగిన పండ్లల్లో దానిమ్మ మొదటి స్థానంలో ఉంటుంది. నిజానికి క్రీస్తూ పూర్వం 1552 కాలం నుండి దానిమ్మను వాడుతున్నారు. మొదటగా, ఈజిప్షియన్ పాపిరస్ దానిమ్మను వైద్యం కోసం వాడి, రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, గ్రీకు వైద్యులు ఆర్థరైటిస్, జీర్ణాశయ సమస్యలను, రక్త ప్రసరణ సమస్యలను, ఇన్ఫెక్షన్‌లను తగ్గించుటకు చాలా మేలైనదని నిపుణులు వెల్లడిస్తున్నారు. చర్మ సమస్యలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందు వల్ల సౌందర్య ఉత్పత్తుల తయారీలో దీనిని ఎక్కువగా వాడుతుంటారు. నిత్యం దానిమ్మ పండును తినటం ద్వారా వీటి వల్ల కలిగే ప్రయోజనాలు పొందవచ్చు. చర్మానికి, దానిమ్మ వాడటానికి గల కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం…

skin

మచ్చలను తగ్గిస్తుంది : నయం చేసే గుణాలను కలిగి ఉండే దానిమ్మ పండు విత్తనాలు, చర్మంపై ఏర్పడే చిన్న చిన్న గాయాలను తగ్గిస్తాయి. వీటిలో ఉండే సమ్మేళనాలు ఇన్ఫెక్షన్ లతో పోరాడే శక్తిని కలిగి ఉండి, గాయాల వల్ల కలిగే మచ్చలను పోగొడతాయి.
పొడి చర్మం : దానిమ్మ పొడితత్వాన్ని, పగిలిన చర్మాన్ని, కలిగే దురదలను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా -5 ఫాటీ ఆసిడ్ లుగా పేర్కొనే ’ప్యూరిసిన్ ఆసిడ్’ లు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచటమేకాకుండా, తేమను కోల్పోకుండా చూస్తాయి.
మొటిమలు తగ్గించుటకు: సాధారణంగా, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత లేదా జీర్ణాశయ సమస్యల వల్ల మొటిమలు కలుగుతాయి. ఇలాంటి సమస్యలను దానిమ్మ తగ్గిస్తుంది. దానిమ్మ, జీర్ణాశయ సమస్యలను తగ్గించి, శరీరంలో ఆరోగ్యకర రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. దానిమ్మ విత్తనాల నుండి సేకరించిన రసాన్ని, నేరుగా మొటిమలపై అప్లై చేయటం వల్ల మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇలా నేరుగా ప్రభావిత ప్రాంతంలో దానిమ్మను అప్లై చేయటం వల్ల నూతన కణజాలం ఉత్పత్తి చెంది, మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
వృద్దాప్య నివారణ : సూర్యకాంతి లేదా వృద్దాప్యం వల్ల చర్మంలో కలిగే మార్పులను నివారించుటలో దానిమ్మ పని చేస్తుంది. ఫైబ్రో బ్లాస్ట్స్ కణాల (కొలాజన్, ఎలాస్టిన్ ఉత్పత్తికి బాధ్యత వహించే కణాలు) జీవితకాలాన్ని పోడిగిస్తాయి. కొలాజన్, ఎలాస్టిన్‌లు చర్మానికి మృదుత్వాన్ని, సాగే గుణాలను అందిస్తాయి. ఫలితంగా, చర్మం యవ్వనంగా కనపడటమేకాకుండా, వృద్దాప్యం వల్ల కలిగే వలయాలను తగ్గిస్తాయి.
జిడ్డు చర్మం : దానిమ్మలో ఉండే రసాలు జిడ్డు చర్మంపై కూడా పని చేసే గుణాలను కలిగి ఉన్నందు వల్ల జిడ్డు చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయరీలో కూడా వాడుతున్నారు.

Comments

comments