Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

‘మిషన్ కాకతీయ వల్లే నిండుకుండల చెరువులు’

Madhusudana-Charyవరంగల్: పరకాల మార్కెట్ యార్డు కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో పాటు స్పీకర్ మధుసూధనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్లే రాష్ట్రంలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయన్నారు. చెరువుల పూడికతీత వల్ల ఇవాళ చెరువులు నీటితో నిండుకుండల కళకళలాడుతున్నాయని చెప్పారు. సిఎం కెసిఆర్ రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించారని తెలిపారు.

Comments

comments