Search
Sunday 18 November 2018
  • :
  • :

ఫైర్ అయిన పూజ

puja

అల్లుఅర్జున్ ‘డీజె’ సినిమాతో గ్లామర్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది పూజాహెగ్డే. ఈ భామ ఇప్పుడు ఫెమినిస్ట్‌గా మారింది. అమ్మాయిలు ఎందులో తక్కువ… ఏ విషయంలో తీసిపోయారంటూ ప్రశ్నిస్తోంది. హీరోలతో సమానంగా హీరోయిన్లు రాణించగలరని వాళ్లకు ఎందుకు తక్కువ పారితోషికం ఇస్తున్నారని అంటూ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రశ్నిస్తోంది. అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్‌గా వచ్చిన ‘మహానటి’ సినిమా టాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇదే సమయంలో బాలీవుడ్‌లో అలియాభట్ హీరోయిన్‌గా నటించిన ‘రాజీ’ సినిమా కూడా సూపర్‌హిట్ అయింది. ఈ రెండూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే. దీనికితోడు ఇటీవల విడుదలైన ‘వీర్ ది వెడ్డింగ్’ నలుగురు అమ్మాయిల కథ. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. అమ్మాయిల ఫీలింగ్స్‌ను బోల్డ్‌గా చూపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ ఉదాహరణలు చూపిస్తూనే పూజాహెగ్డే ఫైర్ అయిపోయింది.

Comments

comments