Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సొంతంగా డబ్బింగ్!

Pooja-hegde

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత..’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే సినిమాలోని తన పాత్రకు పూజ స్వయంగా డబ్బింగ్ చెబుతుండడం విశేషం. ఇదేదో ఆమె ఇష్టపడి చెప్పుకుంటున్న డబ్బింగ్ కాదు. నిజానికి ఆమెకు తెలుగు పూర్తిగా రాదు. కానీ ఆమె చేత త్రివిక్రమ్ డబ్బింగ్ చెప్పిస్తున్నాడట. ఎందుకో హీరోయిన్ పాత్రకు పూజ చేతే డబ్బింగ్ చెప్పించాలని ఈ స్టార్ డైరెక్టర్ నిర్ణయించుకున్నాడట. గతంలో ‘అజ్ఞాతవాసి’ విషయంలో కూడా ఇలాగే చేశాడు ఈ దర్శకుడు. అసలు తెలుగు రాకపోయినా అను ఇమ్యాన్యుయల్‌తో అతను డబ్బింగ్ చెప్పించాడు. కొంచెం తెలుగు వచ్చిన కీర్తిసురేష్‌తో కూడా పూర్తిస్థాయిలో డబ్బింగ్ చెప్పించడం జరిగింది.

Comments

comments