Home తాజా వార్తలు పూజాహెగ్డే కొత్త అవతారం

పూజాహెగ్డే కొత్త అవతారం

Puja-Hegde

అల్లు అర్జున్ చిత్రం ‘డిజే’లో హాట్ బికినీ అందాలతో ప్రేక్షకులను తన మాయలో పడేసిన పూజాహెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పుడు స్టార్ హీరో ఎవరైనా సరే పెద్ద సినిమాల్లో ఈ బ్యూటీని హీరోయిన్‌గా తీసుకుంటున్నారు. ‘అరవింద సమేత వీర రాఘవ’ కోసం స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్న ఈ బ్యూటీ త్వరలో సింగర్ అవతారం ఎత్తబోతోంది. ఇది కూడా త్రివిక్రమ్ సినిమా కోసమే కావడం గమనార్హం. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న మూవీలో పూజానే హీరోయినన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభమైన రెండో షెడ్యూల్‌లో ఆమె పాల్గొంటోంది. ఎప్పటినుంచో పాటలు పాడాలన్న పూజా కోరికను ఓ ఇంటర్వ్యూలో గమనించిన తమన్ ఎట్టకేలకు తన కోరికను తీర్చబోతున్నాడు. చాలా వెరైటీగా హస్కీగా అనిపించే పూజా వాయిస్‌లో ఓ గమ్మత్తు ఉంటుంది.

‘అరవింద సమేత’లో దీన్ని గమనించవచ్చు. అలాంటిది పూజాహెగ్డే పాట పాడితే క్లిక్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ కారణంగానే స్పెషల్ ట్యూన్ ఒకటి కంపోజ్ చేసిన తమన్ త్వరలోనే పాటను రికార్డు చేయబోతున్నట్టు తెలిసింది. ఇది డ్యూయెట్ సాంగా లేదా హీరోయిన్ సోలో సాంగా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ అయితే కొట్టేసింది. తన ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీంతో పాటు ప్రభాస్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న పూజాహెగ్డే బాలీవుడ్‌లో చేసిన ‘హౌస్‌ఫుల్ 4’ త్వరలో విడుదల కానుంది. బాలీవుడ్, సౌత్ రెండు చోట్లా బిజీగా ఉన్న ఈ బ్యూటీ స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

Pooja Hegde to croon a song in #AA19