Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

సూపర్‌స్టార్‌కు జోడీగా పూజ?

poja

అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం హీరోయిన్ పూజా హెగ్డేకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది.  అంతకుముందు తెలుగులో ఆమె చేసిన ముకుందా, ఒక లైలా కోసం చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో పూజ బాలీవుడ్ వెళ్లి అక్కడ ఓ సినిమా చేసింది. కానీ డీజే చిత్రంతో పూజాకు టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఈ హాట్ బ్యూటీ స్విమ్మింగ్‌పూల్  సీన్‌తో యువకులను మైమరపించింది. ప్రస్తుతం ఈ భామ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘సాక్షం’ సినిమాలో నటిస్తోంది. దీని కోసం ఆమె భారీ పారితోషికం అందుకుందట. తాజాగా పూజ మరో బంపర్ ఆఫర్‌ను కూడా అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు 25వ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకునేందుకు సీరియస్‌గా చర్చిస్తున్నారట. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, అశ్వనీదత్ కలిసి నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘భరత్ అను నేను’ అనే సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు మహేష్‌బాబు. దాని పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం కాకముందే వంశీతో అతను సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

Comments

comments